Bigg Boss Fame Shanmukh Jaswanth Grand Mother Passed Away - Sakshi
Sakshi News home page

Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

Published Mon, May 30 2022 12:53 PM | Last Updated on Mon, May 30 2022 3:10 PM

Bigg Boss Fame Shanmukh Jaswanth Grand Mother Passed Away - Sakshi

Bigg Boss Fame Shanmukh Jaswanth Grand Mother Passed Away: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్‌ బిగ్‌బాస్‌ ఎంట్రీతో మరింత పాపులర్‌ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. సోషల్‌ మీడియాలో క్యూట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్ముఖ్‌ గతేడాదిలో విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో తన కెరీర్‌పై ఫోకస్‌ పెట్టి షణ్ముఖ్‌ జశ్వంత్‌ 'ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌' సిరీస్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 

అయితే అంత సవ్యంగా జరుగుతున్న షణ్ముఖ్‌ జీవితంలో విషాదం నెలకొంది. షణ్ముఖ్‌ బామ్మ మరణించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు షణ్ను తన బామ్మతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. ఈ స్టోరీకి రిప్‌ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. బామ్మతో షణ్ముకు ఉన్న అటాచ్‌మెంట్‌ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియోలో తన పెళ్లి చూస్తావా అని షణ్ను అడగ్గా 'ఏమో చూస్తానో లేదో..' అని బామ్మ అన్నట్లుగా ఉంది. 'నువ్ ఉండాలి' అని షణ్ము అనగా, 'నీ పెళ్లి వరకు కచ్చితంగా ఉంటుంది' అని వెనకాల నుంచి మాటలు వినిపించాయి. 

చదవండి: నేను సింగిల్‌, కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్‌
సినిమా టికెట్ల కోసం క్యూలో మహేశ్‌ బాబు.. వీడియో వైరల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement