Bigg Boss 5 Telugu: సిరి, షణ్ను, మానస్, సన్నీ, శ్రీరామ్ బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ టైటిల్ రేసులో ఉన్నారు. అయితే పోటీ మాత్రం సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టికెట్ టు ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ ఎఫెక్ట్ ఇంకా తగ్గనట్లు కనిపిస్తోంది. ఐస్ టాస్క్‌లో అందరికంటే ఎక్కువగా సిరి, శ్రీరామ్ గాయపడ్డారు. కొద్దిరోజుల వరకు లేచి నడవలేకపోయారు. సిరి అంతో ఇంతో కోలుకున్నా శ్రీరామ్ ఇప్పటికీ ఆ బాధను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐస్ టాస్క్ తర్వాత ప్రియాంక అతడి కాళ్లపై వేడినీళ్లు పోసి బామ్ రాయడంతో అతడి నొప్పి మరింత తీవ్రతరమైంది. దీంతో వెంటనే వైద్యులు అతడికి చికిత్స చేయడమే కాకుండా పింకీని హెచ్చరించిన విషయం తెలిసిందే! పింకీ తెలియకుండా చేసిన తప్పు వల్ల శ్రీరామ్ ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాడు. కానీ బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో అతడు చెప్పులు వేసుకోకుండా వాటిపై నిల్చున్నాడు. అప్పుడు అతడి కాళ్లపై చర్మం మొత్తం ఊడిపోయినట్లు కనిపించింది. ఇది బ్యాండేజా? లేదా చర్మం ఊడిపోయిందా? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
మెజారిటీ నెటిజన్లు, మాజీ కంటెస్టెంట్లు సైతం అతడి పాదాల చర్మం ఊడిపోయిందంటూ, అయినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా టాస్కులు ఆడుతున్నాడంటూ శ్రీరామ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. కల్మషం లేని మనస్తత్వం తనదంటూ శ్రీరామ్‌కు ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అయితే శ్రీరామ్ గాయాలపై అతడి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి క్లారిటీ ఇస్తూ పోస్ట్ వదిలాడు అడ్మిన్. శ్రీరామ్ పాదాలపై ఉంది బ్యాండేజీ మాత్రమేనని, అతడి ఆరోగ్యం గురించి కంగారుపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు అడ్మిన్, శ్రీరామ్ కాలి చర్మం నిజంగానే ఊడిపోయిందంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ గాయం వల్ల అతడిపై సింపతీ పెరగడంతో పాటు అవి ఓట్లుగా మారడం కలిసొచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment