బిగ్‌బాస్‌ హౌస్‌లో పెళ్లి, అంతలోనే బ్యాడ్‌ న్యూస్‌ అంటూ బాంబ్‌! | Bigg Boss 5 Telugu Promo: Bad News for Priya After Skit | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: లహరి, శ్రీరామ్‌కు పెళ్లి చేసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌

Published Wed, Sep 22 2021 5:40 PM | Last Updated on Wed, Sep 22 2021 7:15 PM

Bigg Boss 5 Telugu Promo: Bad News for Priya After Skit - Sakshi

Bigg Boss Telugu 5 Promo: నామినేషన్స్‌తో ఫైర్‌ మీదున్న కంటెస్టెంట్లను కూల్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి టాస్క్‌ను అటు హౌస్‌మేట్స్‌ కూడా బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. అమెరికా అబ్బాయి పాత్రలో జీవిస్తున్న శ్రీరామ్‌ అటు హమీదాతో, ఇటు సిరితో లవ్‌ ట్రాక్‌ నడుపుతూనే లహరితో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు లహరి కూడా మానస్‌ను ప్రేమిస్తూనే ఇటు శ్రీరామ్‌తో పెళ్లికి సై అంది. దీంతో మ్యారేజ్‌ బ్రోకర్‌ షణ్ముఖ్‌ సహాయంతో ఎంతగానో కష్టపడి శ్రీరామ్‌, లహరికి పెళ్లి జరిపించినట్లు ప్రోమోలో చూపించారు.

ఇద్దరూ ఉంగరాలతోపాటు దండలు కూడా మార్చుకున్నారు. ఈ పెళ్లికి కంటెస్టెంట్లే పెద్దలు, అతిథులు అన్నీనూ! మొత్తానికి ఈ టాస్క్‌ అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫోన్‌ రింగైంది. వెంటనే హడావుడిగా ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన ప్రియకు.. మీకో బ్యాడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నానంటూ అవతలి వ్యక్తి టెన్షన్‌ పెట్టేశాడు. మరి ఆ బ్యాడ్‌ న్యూస్‌ ఏంటి? అది హౌస్‌ మొత్తానికా? లేదా ప్రియకు మాత్రమే బ్యాడ్‌ న్యూసా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement