
బిగ్‌బాస్ హౌస్‌లో 9వ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ మినహా..మిగిలిన సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇంట్లో 11 మందిలో ఒకేసారి 10 మంది నామినేట్ కావడం గమనార్హం. ఒక్కో ఓటు వచ్చిన యానీ మాస్టర్, విశ్వలు సైతం నామినేషన్స్‌లోకి వెళ్లారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడం వల్ల సేఫ్ అయ్యాడు. అయితే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ వారికి ఒక టాస్క్ ఇచ్చినట్లు తాజా ప్రోమో ద్వారా తెలుస్తోంది.
(చదవండి: బిగ్‌బాస్: లోబో అన్ని లక్షలు వెనకేసుకున్నాడా?)
గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్‌లోకి తమ ఫోటో కాకుండా.. మిగిలిన సభ్యుల ఫోటో ఉన్న బ్యాగులు తీసుకొని పరుగెత్తాలి. వీరిలో ఎవరైతే చివరిగా సేఫ్‌జోన్ డోర్‌లోకి వెళ్లారో.. ఆ సభ్యుడితో పాటు అతని చేతిలో ఎవరి బ్యాగు ఉందో ఇద్దరు డేంజర్‌లోకి వెళ్తారు. ఈ గేమ్‌లో కాజల్, శ్రీరామచంద్ర తొలి రౌండ్‌లోనే డేంజర్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాజల్ ఫోటో ఉన్న బ్యాగును తీసుకున్న శ్రీరామచంద్ర.. ముందుగా గార్జెన్ ఏరియాలోకి వచ్చినప్పటికీ.. కావాలనే సేఫ్ జోన్ డోర్‌లోకి వెళ్లనట్లు తెలుస్తోంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి.. నామినేషన్స్ నుంచి బయటపడ్డారో తెలియాలంటే.. నేటి ఎపిసోడ్‌ను చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment