
Bigg Boss Telugu 5, Sonu Sood Supports Sreerama Chandra: సోనూసూద్.. లాక్‌డౌన్ ముందు వరకు ఈయన విలన్‌గానే అందరికీ తెలుసు, కానీ లాక్‌డౌన్ తర్వాత సీన్ మారింది! నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు కొండంత అండనిస్తూ పేదప్రజల పాలిట పెన్నిధిగా మారి యువతకు సూపర్ హీరో అయ్యాడీ యాక్టర్. అతడు చేసే సేవా కార్యక్రమాలకు యావత్ దేశం ఫిదా అయింది! ప్రభుత్వాలు చేయలేని సాయాన్ని మీరు చేశారంటూ సోనూను వేనోళ్ల కొనియాడారు. తన దయాగుణంతో, తలపెట్టిన మంచిపనులతో స్టార్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు సోనూసూద్.
తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్ షోపై స్పందించాడు. ప్రస్తుత సీజన్‌లో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటించాడు. ఈ మేరకు ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో హడావుడి చేస్తోంది. 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్‌ను చూస్తున్నారా? నేనూ చూస్తున్నాను. షోలో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్. అతడికివే నా ప్రేమాభినందనలు.. లవ్ యూ మ్యాన్' అని చెప్పుకొచ్చాడు. శ్రీరామచంద్ర ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వావ్ అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు 'హమ్మయ్య, ఇక బిగ్‌బాస్ కప్పు శ్రీరామ్‌దే'నని కామెంట్లు చేస్తున్నారు.
(చదవండి: శ్రీరామ్‌కే మద్దతిస్తానంటున్న ప్రముఖ కమెడియన్)
(చదవండి: నా పాయింట్‌లో ఇదే కరెక్ట్, నేను అలానే చేస్తా.. పింకీపై షణ్ముఖ్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment