Bigg Boss Sreerama Chandra Comments About His Marriage And Future Wife: బిగ్‌బాస్ సీజన్-5 ముగిసింది. విన్నర్‌గా సన్నీ, రన్నరప్‌గా షణ్ముక్ నిలవగా, సింగర్ శ్రీరామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు. తన ఆటతీరుతోనే కాకుండా, పాటలతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీరామ్..తన పెళ్లి, కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయాలపై ఓపెన్ అప్ అయ్యాడు.
'గత మూడేళ్లుగా పెళ్లి గురించి ఫోర్స్ చేస్తున్నారు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటా. ఎలాంటి అమ్మాయి కావాలి అన్న దానిపై పెద్ద సెలక్షన్స్ ఏం లేవు..కానీ అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్స్‌కి విలువ ఇచ్చే అమ్మాయై ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి. ఇలా ఉంటే చాలు' అంటూ తన మనసులో మాటను బయటపెట్టేశాడు.
Comments
Please login to add a commentAdd a comment