
బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
Bigg Boss 5 Telugu Second Runner Up: ఎంతో ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ డిసెంబర్ 19న అంగరంగ వైభవంగా ముగిసింది. 19 మందితో ప్రారంభమైన ఈ షోలో మానస్, సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్, సిరి టాప్ 5లో నిలిచారు. వీరిలో సన్నీ విజేతగా అవతరించగా షణ్ను రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానంలో చోటు దక్కించుకుంటాడనుకున్న శ్రీరామ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు.
అయితే ట్రోఫీకన్నా, బిగ్‌బాస్ ఇచ్చే ప్రైజ్‌మనీ కన్నా తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడమే ముఖ్యమనుకున్నాడు శ్రీరామ్. తన గాత్రంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో 15 వారాలపాటు ఉన్న శ్రీరామ్ ఎంత గెలుచుకున్నాడన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే అతడు వారానికి రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు అందుకున్నాడట. అంటే బిగ్‌బాస్ షో ద్వారా అతడు మొత్తంగా రూ.35 లక్షలు వెనకేసినట్లు తెలుస్తోంది.