
Bigg Boss Telugu 5, Episode 86: ఇంటిసభ్యులంతా రవి ఎలిమినేషన్ గురించే చర్చించారు. టాప్ 3లో ఉంటాడనుకున్నా అని షణ్ను, టాప్ 2లో ఊహించానని శ్రీరామ్.. రవి గురించి అభిప్రాయాలు షేర్ చేసుకున్నారు. అటువైపు కాజల్ మాత్రం ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో కాకుండా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయ్యానని తెగ సంతోషపడిపోయింది. మరోపక్క మానస్.. తను టైటిల్‌ను లెక్క చేయనని తేల్చేశాడు. ప్రజల మనసులు గెలవడమే తనకు ముఖ్యమన్నాడు. ఈ మధ్య ప్రియాంకను కనీసం ముట్టుకోవడం లేదన్నాడు. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో అన్న భయంతో హగ్ చేసుకోవడం మానేశానని చెప్పుకొచ్చాడు.
పింకీ చాలా ఒంటరిగా ఫీల్ అవుతోందని, నన్ను తనతో ఉండమంటోందని షణ్నుతో చెప్పుకొచ్చింది సిరి. తర్వాత పింకీ దగ్గరకు వెళ్లి ఏమైంది డల్‌గా ఉన్నావంటూ ఆమె బాధను పోగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ప్రియాంక రవి లేని లోటు గురించి చెప్పుకొచ్చింది. నా చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతున్నప్పుడు నాకు కనిపించే వ్యక్తి రవి అన్నయ్య, అతడు లేకపోతే నాకు ధైర్యం లేనట్లు అనిపిస్తోందని బాధపడింది పింకీ. మరోపక్క షణ్ను వద్దంటున్నా సిరి హగ్గివ్వడానికి వెళ్లింది. అతడు ఎంత వారించినా వినకుండా ఫ్రెండ్‌షిప్ హగ్గంటూ షణ్నును హత్తుకుంది.
ఎప్పటిలాగే కాజల్ ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉంటారు? ఎవరు ఎవర్ని చేస్తారని లెక్కలు వేసుకుంటూ కూర్చుంది. సన్నీనెవరూ నామినేట్ చేయరని ఘంటాపథంగా చెప్పింది. చివరకు ఆమె అన్నదే నిజమైందనుకోండి, అది వేరే విషయం! మరోపక్క షణ్ముఖ్.. ప్రియాంకతో మాట్లాడుతూ.. సన్నీ, మానస్, కాజల్ ధైర్యం ఏంటంటే.. నిన్నేం చేసినా నువ్వు వాళ్లను నామినేట్ చేయవు, ఎదురు తిరగవని వాళ్ల నమ్మకం. నువ్వు వాళ్ల కంట్రోల్‌లో ఉన్నావనుకుంటున్నారు అని ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నించాడు.
అనంతరం 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇంటిసభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి. కమ్యూనిటీ(ట్రాన్స్‌జెండర్) పేరు తీయడం తప్పంటూ కెప్టెన్ షణ్ముఖ్ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్ చేస్తూ ఆమె ఫేస్ ఉన్న బంతిని ఒక్క తన్ను తన్నాడు. ప్రియాంక.. ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కావట్లేదని సమయం వృథా చేయగా బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్స్ తెలపకపోతే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్ చేసింది. శ్రీరామ్.. నన్ను అగౌరవపర్చారంటూ మానస్, కాజల్‌ను నామినేట్ చేశాడు.
ఎమోషనల్‌గా కనెక్ట్ అవకుండా నీ గేమ్ నువ్వు ఆడంటూ సిరి.. పింకీ ఫేస్ ఉన్న బంతిని తన్నింది. కమ్యూనిటీ అన్న పదం వాడటం తప్పంటూ కాజల్‌ను నామినేట్ చేసింది. సన్నీ, మానస్.. సిరి, శ్రీరామ్‌లను నామినేట్ చేశారు. నేను కమ్యూనిటీ అన్న పదం తీయడం తప్పు తప్పు అని భూతద్దంలో చూపిస్తున్నారంటూ కాజల్.. సిరి, ప్రియాంకను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం సిరి, మానస్, ప్రియాంక, శ్రీరామ్, కాజల్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment