Bigg Boss Telugu 5: Finalists Gets Emotional About Their Memories - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 5: ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నాను, కానీ తప్పని నిరూపించాడు.. సిరి

Dec 15 2021 7:51 PM | Updated on Dec 15 2021 9:33 PM

Bigg Boss Telugu 5: Finalists Gets Emotional About Their Memories - Sakshi

జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అమ్మ రాసిన లెటర్‌ కళముందే ముక్కలవడం.. అని తెలిపాడు షణ్ను..

Bigg Boss 5 Telugu Promo: రోజులు గడిచేకొద్దీ కంటెస్టెంట్లలో టెన్షన్‌ పెరుగుతోంది. టైటిల్‌ గెలిచేదెవరని ఇటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వంద రోజుల్లో ఎన్నో టాస్కులు ఆడించిన బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ గడిచిన జ్ఞాపకాలను తడిమి చూసుకునేందుకు కావాల్సినంత సమయాన్నిచ్చాడు. అందులో భాగంగా వారి సంతోష, చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు ఫైనలిస్టులు.

'టెడ్డీబేర్‌ టాస్కులో నేను, యానీ మాస్టర్‌, సన్నీ గెలిచాక సంతోషంతో హగ్గిచ్చుకున్నాం..' అంటూ తను చూపిస్తున్న ఫొటో వెనకాల స్టోరీ చెప్పుకొచ్చాడు మానస్‌. జర్నీ మొత్తంలో బాగా బాధపడిన క్షణాలేవైనా ఉన్నాయా అంటే అది అమ్మ రాసిన లెటర్‌ కళ్లముందే ముక్కలవడం.. అని బాధపడ్డాడు షణ్ను. బ్రిక్స్‌ ఛాలెంజ్‌ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఈ టాస్క్‌కు ముందే షణ్నును ఫేక్‌ ఫ్రెండ్‌ అన్నాను. కానీ అది తప్పని బ్రిక్స్‌ ఛాలెంజ్‌లో నిరూపించాడు అని పేర్కొంది సిరి. నేనెప్పుడూ చెప్పలేదు కానీ హమీదాను చాలా మిస్సవుతున్నా, ఆమె ఉండుంటే లోన్‌ రేంజర్‌ అనే పేరు వచ్చేది కాదు, ఈ జర్నీలో ఆమెను మిస్సయ్యాను అన్నాడు శ్రీరామ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement