
ఏదో కొద్ది మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినప్పటికీ సిరి దాన్ని స్వీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ గెలుస్తానని నమ్మకం పెట్టుకోలేదు, గెలవాలనుకోవడం లేదు కూడా!
Bigg Boss Telugu 5 Final, Will Big Boss Offer 25 Lakhs and Who Has the Chance to Take in BB Housemates: వంద రోజుల సస్పెన్స్‌కు రేపటితో తెర పడనుంది. బిగ్‌బాస్ విన్నర్ ఎవరనేది రేపు(డిసెంబర్ 19) డిసైడ్ కానుంది. ప్రస్తుతమైతే సోషల్ మీడియాలో గెలిచేది మావాడేనోయ్.. అంటూ ఫైనలిస్టుల ఫ్యాన్స్ నానారచ్చ చేస్తున్నారు. మరోపక్క అనఫీషియల్ ఓటింగ్‌లో సన్నీ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటంతో అతడే విన్నర్ అని ప్రచారం జరుగుతోంది. దీంతో షణ్ముఖ్, శ్రీరామ్ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే గత సీజన్‌లోలాగా బిగ్‌బాస్ ఈసారి కూడా రూ.25 లక్షలు ఆఫర్ చేస్తాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నాలుగో సీజన్‌లో బిగ్‌బాస్ రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో నుంచి పాతిక లక్షలను ఆఫర్ చేయగా సోహైల్ ఆ డబ్బును స్వీకరించి స్వతాహాగా టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు సీజన్లలో ఏ కంటెస్టెంట్ కూడా ఇలా డబ్బు తీసుకోకపోగా సోహైల్ ఆ ట్రెండ్‌ను మార్చేశాడు. మరి ఈ సీజన్‌లో డబ్బు ఆశ చూపిస్తే ఎవరైనా దాన్ని తీసుకుని స్వతాహాగా ఎలిమినేట్ అవుతారా? అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది.
అయితే ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నప్పుడు బిగ్‌బాస్ అసలు క్యాష్ ఆఫర్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేసినా మరీ ఇంత పెద్ద మొత్తాన్ని మాత్రం కచ్చితంగా ఆఫర్ చేయరు. కాకపోతే ఏదో కొద్ది మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినప్పటికీ సిరి దాన్ని స్వీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఎప్పుడూ గెలుస్తానని నమ్మకం పెట్టుకోలేదు, గెలవాలనుకోవడం లేదు కూడా! కేవలం షణ్నూనే విన్నర్‌గా చూడాలనుకుంటోంది. అలాంటప్పుడు తనకు డబ్బు ఆఫర్ చేస్తే తీసుకోకుండా ఉండే ప్రసక్తే లేదు. మానస్ ఇలా డబ్బు తీసుకుని ఎలిమినేట్ అవడానికి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు ఫైనలిస్టులకు ఇంలాంటి బంపర్ ఆఫర్ ఏమీ ఇవ్వకుండా బిగ్‌బాస్ నేరుగా ఎలిమినేట్ చేయనూ వచ్చు.
టాప్ 3 కంటెస్టెంట్లకు మాత్రం బిగ్‌బాస్ డబ్బుతో కూడిన సూట్‌కేసును చూపించి టెంప్ట్ చేసే అవకాశాలున్నాయి. షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాబట్టి ఈ ముగ్గురు కూడా సూట్‌కేసు తీసుకోవడానికి వెనుకాడతారు. కానీ మీ కుటుంబంతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు అని మెలిక పెడితే మాత్రం శ్రీరామ్ ఆ సూట్‌కేసు అందుకుని లాభపడతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే బిగ్‌బాస్ ఈసారి బంపర్ ఆఫర్ ఇస్తాడా? ఇస్తే దాన్ని ఎవరు గెలుచుకుంటారు? ఎంత గెలుచుకుంటారు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రేపటి గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూడాల్సిందే!