
Bigg Boss Telugu 5 Promo, Ex Bigg Boss Housmates Fun: చప్పగా సాగుతున్నషోలో కొంత ఎనర్జీ నింపడానికి మాజీ కంటెస్టెంట్లను రంగంలోకి దించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శివబాలాజీ, హరితేజ, అఖిల్ సార్థక్, రాహుల్ సిప్లిగంజ్, శివజ్యోతి, రోల్ రైడా, అరియానా, గీతా మాధురి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. కాకపోతే గతేడాదిలాగే ఈసారి కూడా కరోనాను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్షంగా కాకుండా ఓ రూమ్‌లో నుంచి సంభాషించారు. ఈ అతిథులు ఫైనలిస్టుల్లో మరింత ఎనర్జీ నింపగా హరితేజ మాత్రం వారిని రోస్ట్ చేస్తూ నవ్వించింది. ఇక రాహుల్ సిరికోసం పాట పాడి ఆకట్టుకున్నాడు. అంతేకాదు హౌస్‌మేట్స్‌తో గేమ్స్ కూడా ఆడించినట్లు కనిపిస్తోంది.
సిరి, షణ్ను కలిసి డ్యాన్స్ చేస్తుంటే మానస్, సన్నీ, శ్రీరామ్ మాత్రం వాళ్లకు వాళ్లే స్టెప్పులేసుకున్నారు. వీరిని చూసి జాలిపడ్డ హరితేజ మీకు చప్పట్లు కొట్టడానికి కూడా ఎవరూ లేరే అని సెటైర్లు వేసింది. మా బాధ అర్థం చేసుకుని బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఎలిమినేషన్ అంటూ సిరిని పంపించేస్తే మేమంతా సంబరపడ్డాం. కానీ అంతలోనే కన్ఫెషన్ రూమ్ నుంచి షణ్నూ అంటూ పరిగెత్తుకొచ్చింది అని సరదాగా జోక్ చేశాడు. అయితే అతడి ఇన్నర్ ఫీలింగ్ కూడా అదేకానీ పైకి మాత్రం జోక్ చేసినట్లు చెబుతూ కవర్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా మొత్తానికి మానస్, సన్నీ, శ్రీరామ్ ఒకే దగ్గర కలిసి ఉంటుంటే చూడటానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు ఫ్యాన్స్!

Comments
Please login to add a commentAdd a comment