
Bigg Boss 5 Telugu, 12th Week Nominations: బిగ్‌బాస్ ఇంట్లో 12వ వారం నామినేషన్స్ వాడివేడిగా జరిగాయి. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు వ్యక్తుల దిష్టిబొమ్మలను పగలగొట్టాల్సి ఉంటుంది. మొదటగా రవి వంతు రాగా.. విధులు సరిగా నిర్వర్తించట్లేదంటూ సన్నీని, తర్వాత కాజల్‌ను నామినేట్ చేశాడు. గతవారం గేమ్ పెద్దగా ఆడలేదంటూ షణ్ను కుండ పగలగొట్టింది ప్రియాంక. సిరిని నామినేట్ చేసే క్రమంలో ఆమెతో పెద్ద గొడవే అయింది.
కెప్టెన్‌గా, సంచాలకుడిగా పర్ఫెక్ట్‌గా లేడంటూ షణ్ను.. రవి దిష్టిబొమ్మపై కుండ పెట్టి పగలగొట్టాడు. సిరి-షణ్ను ప్లాన్ చేసుకుని వచ్చారా? అన్న ప్రశ్న వీకెండ్‌లో కాకుండా డైరెక్ట్‌గా అడుగుంటే బాగుండేదని కాజల్‌ను నామినేట్ చేశాడు. నీవల్ల కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయానంటూ సన్నీ కుండ బద్ధలకొట్టాడు శ్రీరామ్. ఎవిక్షన్ పాస్ యానీ మాస్టర్‌కు రాకుండా చేసి సన్నీకిచ్చిన కాజల్ కుండ ముక్కలు చేస్తూ ఆమెపై నిప్పులు చెరిగాడు శ్రీరామ్. యానీ మాస్టర్‌కు పాస్ రాకుండా చేయడం వల్ల ఆమె ఎలిమినేట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
హౌస్‌లో అందరికంటే ఫేక్ అంటూ రవిని నామినేట్ చేశాడు సన్నీ. ఇక హౌస్ నుంచి వెళ్లిపోయిన యానీ మాస్టర్ కోసం సన్నీ, శ్రీరామ్ గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు నానా మాటలు అనుకున్నారు. అనంతరం సిరి.. నా వెనకాల మాట్లాడొద్దంటూ పింకీని, అలాగే రవిని నామినేట్ చేసింది. హౌస్‌లో నాకు ఇష్టం లేని వ్యక్తి, జెన్యున్‌గా లేనిది ఒక్కడేనంటూ రవిని నామినేట్ చేసింది కాజల్. యానీ మాస్టర్ ఉసురు పోసుకుంటున్నామని అనడం నచ్చలేదని శ్రీరామ్ కుండ పగలగొట్టింది. తర్వాత కెప్టెన్ మానస్.. శ్రీరామ్, రవిని నామినేట్ చేశాడు. మొత్తానికి వాడివేడిగా సాగిన ఈ ప్రక్రియలో కెప్టెన్ మానస్ మినహా మిగతా ఏడుగురూ నామినేట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment