బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఐదో ఎలిమినేషన్ ఊహించినట్లుగానే జరిగింది. ముందు నుంచీ అనుకున్నట్లే హమీదా హౌస్ నుంచి నిష్క్రమించింది. అయితే ఆమె లేని లోటు అందరికన్నా ఎక్కువగా శ్రీరామ్‌ను వెంటాడనుంది. నిరంతంరం అతడినే అంటిపెట్టుకుని ఉంటూ అటు పనుల్లోనూ, ఇటు టాస్కుల్లోనూ శ్రీరామ్ చేయి విడవలేదు హమీదా. అలాంటిది సడన్‌గా అతడికి దూరం కావాల్సిరావడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పేముందు శ్రీరామ్‌ను కళ్లారా చూసుకుని మనసారా ఏడ్చేసింది.
అతడి మీదున్న ప్రేమను తాజాగా బిగ్‌బాస్ బజ్‌లో బయటపెట్టిందీ బ్యూటీ. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరైన హమీదా కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. షణ్ముఖ్ హౌస్‌లో పెదరాయుడు అని చెప్పుకొచ్చింది. సిరి.. గ్రూప్‌లో ఉందని, ఆమె చిన్న విషయాన్ని పెద్ద రాద్దాంతం చేయడానికి ఆలోచిస్తుందని పేర్కొంది. శ్రీరామ్, మానస్ రెండు కళ్లు అన్న ప్రియాంక సింగ్ రిలేషన్‌షిప్‌ను ఫేక్ చేస్తుందని ఆరోపించింది.
హౌస్ నుంచి ఏం తీసుకువెళ్తున్నావ్? అన్న అరియానా ప్రశ్నకు హమీదా క్షణం ఆలోచించకుండా శ్రీరామ్ అని సమాధానమిచ్చింది. అంతేకాకుండా శ్రీరామ్ ఫొటో చూడగానే సిగ్గుతో ముడుచుకుపోతూనే ఎమోషనల్ అవుతూ లవ్ సింబల్ చూపిస్తూ మనసులోని ప్రేమను బయటపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అన్యాయంగా శ్రీరామ్-హమీదాలను విడదీసారంటూ కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment