
19 మందితో కళకళలాడిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు ఆరుగురు వెళ్లిపోగా అందులో ఐదుగురు ఆడవాళ్లే కావడం గమనార్హం. ఇక ఈ వారం ఒకరిని పంపించేందుకు రంగం సిద్ధమైంది. ఈసారి కాజల్, సిరి, రవి, యానీ, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో.. ఇలా 8 మంది నామిషన్‌లో ఉన్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకునేందుకు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈపాటికే ప్రచారానికి దిగిన విషయం తెలిసిందే! అయితే ఓ కంటెస్టెంట్ కోసం ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది. తన ఫ్రెండ్‌కు ఓటేయమంటూ జనాలను అభ్యర్థిస్తోంది.
ఆమె మరెవరో కాదు 'ఆర్‌ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపిందీ భామ. 'నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నాడు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. నేను కొన్ని ఎపిసోడ్లలో శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి ఓ మై గాడ్ అనుకున్నాను. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ నీకెప్పుడూ ఉంటాయి. శ్రీరామ్‌కు ఓటేసి మీ ప్రేమాభిమానాలను చాటుకోండి. ప్రతీ ఒక్క ఓటు కూడా విలువైనదేనని గుర్తుంచుకోండి అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment