Singer Sreerama Chandra Request To CM KCR, KTR For His Flight Missed - Sakshi
Sakshi News home page

Sreerama Chandra: శ్రీరామ చంద్ర అసహనం.. ఫ్లైట్‌ మిస్‌ అయ్యిందంటూ కేసీఆర్‌కు ఫిర్యాదు

Published Tue, Jan 31 2023 1:51 PM | Last Updated on Tue, Jan 31 2023 2:57 PM

Singer Sreerama Chandra Request to CM KCR, KTR For His Flight Missed - Sakshi

టాలీవుడ్‌ సింగర్‌, ఇండియన్‌ ఐడల్‌ విజేత శ్రీరామ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. ఓ పోలిటిషియన్‌ కారణంగా ఫ్లైట్‌ మిస్‌ అయ్యానంటూ మంత్రి కేటీఆర్‌కు శ్రీరామ చంద్ర ట్విటర్‌ వేదికగా ఫిర్యాదు చేశాడు. తన ఫ్లైట్‌ మిస్‌ అవ్వడానికి గల కారణం వెల్లడిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో శ్రీరామ చంద్ర ఏం అన్నాడేంట.. ‘‘ఓ రాజకీయనాయకుడి కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారు. దాంతో పబ్లిక్ ఫ్లైఓవర్‌ కింద నుంచి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాల రద్దితో నా ప్రయాణం అరగంట ఆలస్యమైంది.

చదవండి: అవతార్‌ 2ను వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో ఆర్‌ఆర్‌ఆర్‌

దీంతో నేను వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యాను. నేను కాదు నాతో పాటు మరో 15 మంది ఈ ఫ్లైట్‌ మిస్‌ అయ్యారు. గోవాలో నేను ఓ ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇప్పుడు నేను వేరే ఫ్లైట్ పట్టుకోని గోవా చేరుకోవడమంటే కష్టమైన పని. కాబట్టి.. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గార్లకు నా విన్నపం ఏమిటంటే.. రాజకీయ నాయకుల కోసం మాలాంటి సామాన్య జనాలను ఇబ్బంది పెట్టకండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన ట్వీట్‌కు మంత్రి కేటీర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్‌ చేశాడు. ఇక శ్రీరామ చంద్ర ట్విట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో పెద్ద ఎత్తున శ్రీరామ చంద్రకు మద్దతు లభిస్తోంది.

చదవండి: తారకరత్న ఆరోగ్యంపై ఎమోషనల్‌ పోస్ట్‌ చేసిన చిరంజీవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement