
Bigg Boss 5 Telugu, Ticket To Finale Winner Sreerama Chandra: బిగ్‌బాస్ హౌస్‌లో 'టికెట్ టు ఫినాలే' టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు కొనసాగిన గేమ్‌లో కాజల్, ప్రియాంక సింగ్, షణ్ముఖ్ అవుట్ అవగా సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్ టాప్ 5లో బెర్తు దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నారు. అయితే సిరి ఫినాలే టికెట్ సొంతం చేసుకుని ఫైనల్‌లో అడుగు పెట్టిందంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి తెగ ప్రచారం జరిగింది. అయితే ఇంకా టాస్క్ పూర్తవలేదని, అది కేవలం ఊహాగానాలేనని పలువురూ పేర్కొన్నారు. కానీ ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే కంటెస్టెంట్ గెలుస్తున్నారంటూ క్లూ ఇచ్చారు. దీంతో సిరి, శ్రీరామ్, సన్నీలలో ఒకరు ఫినాలేకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు.
ఈ సమయంలో టికెట్ టు ఫినాలే పోటీ ముగిసిందంటూ, విన్నర్ ఎవరో తెలిసిపోయిందంటూ నెట్టింట లీకువీరులు హల్‌చల్ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా సిరి కాకుండా శ్రీరామ్ గెలిచాడని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవేవీ నిజం కాకుండా పోలేదు, దీంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందంటూ శ్రీరామ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐస్ క్యూబ్స్‌లో నిలబడాల్సిన టాస్క్‌లో శ్రీరామ్ పాదాలు స్పర్శ కోల్పోయిన విషయం తెలిసిందే కదా! దీంతో ఫిజికల్ టాస్క్‌లో శ్రీరామ్‌కు బదులు సన్నీ ఆడి అతడిని గెలిపించాడు. తన ఆటలో వెనకబడిపోయినా సరే శ్రీరామ్‌ను మాత్రం గేమ్‌లో ముందు వరుసలో ఉంచాడు. అలా అతడు శ్రీరామ్‌ను గెలిపించాడంటూ ఫ్యాన్స్ సన్నీని ఆకాశానికెత్తుతున్నారు. కానీ నేటి ఆటలో శ్రీరామ్ కోసం సన్నీ ఆడాడా? షణ్ను ఆడాడా? అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment