Bigg Boss 5 Telugu Grand Finale Highlights: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో సిరి, మానస్ ఎలిమినేట్ కావడంతో శ్రీరామ్, షణ్ను, సన్నీ ముగ్గురు మాత్రమే మిగిలారు. వీళ్లకు మరోసారి క్యాష్ ఆఫర్ చేశారు. నాగచైతన్య గోల్డెన్ సూట్‌కేస్‌తో హౌస్‌లోకి వెళ్లాడు. కానీ ఎవరూ దానికి టెంప్ట్ కాలేదు. దీంతో నాగ్ ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహించాడు. శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అనంతరం ఆ సూట్‌కేసులో రూ.20 లక్షలు ఉన్నట్లు వెల్లడించాడు నాగ్.
ఇక స్టేజీపైకి వచ్చిన శ్రీరామచంద్ర తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ఈ షోలో అడుగుపెట్టానని, చివరకు అది సాధించానని సంతోషం వ్యక్తం చేశాడు. హౌస్‌లో చాలా నేర్చుకున్నానన్న శ్రీరామ్ రేపటినుంచి నాలో కొత్త పర్సన్‌ను చూస్తానని తెలిపాడు. వెళ్లిపోయే ముందు చివరిసారిగా 'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ..' అంటూ మెలోడీ సాంగ్ అందుకున్నాడు. ఈ పాట వింటూ శ్రీరామ్ తల్లితో పాటు హమీదా కంటతడి పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment