Bigg Boss Telugu 5 Promo: These Housemates Will Not Taste Mutton Biryani - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu Promo: వాళ్లు ఒకటే నరుకుడు, వీళ్లు ఒకటే కుమ్ముడు!

Published Wed, Sep 29 2021 5:30 PM | Last Updated on Wed, Sep 29 2021 9:24 PM

Bigg Boss Telugu 5: These Housemates Will Not Taste Mutton Biryani - Sakshi

Bigg Boss Telugu 5 Promo: 'తిండి కలిగితే కండ కలదోయ్‌' అంటారు! కానీ తిండిని కంట్రోల్‌లో పెట్టి బరువు తగ్గితే గెలుపు మీదేనోయ్‌ అంటున్నాడు బిగ్‌బాస్‌. ఓస్‌ అంతేనా అనేయకండి.. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల నోరూరించేలా టేస్టీ వంటకాలను హౌస్‌లోకి పంపిస్తూనే ఉన్నాడు. నోరు కట్టేసుకోలేక ఎవరో ఒకరు దాన్ని తింటూనే ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ అన్నం, ముద్ద పప్పు పంపించాడు. తనకు ఆరోగ్యం బాగోలేదంటూ విశ్వ ఆ ఫుడ్‌ అందుకుని ఆరగించాడు.

తాజాగా నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ మటన్‌ బిర్యానీ పంపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. బిర్యానీని చూడగానే ఎన్నో గంటలుగా తిండీనిద్రా మాని ఉన్న కంటెస్టెంట్లలో నూతనోత్తేజం పొంగిపొర్లింది. ఇంకా కడుపు మాడ్చుకోవడం మా వల్ల కాదంటూ చాలామంది బిర్యానీని ఓ పట్టు పట్టారు. అయితే వీజే సన్నీ, శ్రీరామ్‌, హమీదా మాత్రం బిర్యానీని కనీసం ముట్టుకోలేదంటున్నారు లీకువీరులు. మరి ఇది నిజమేనా? కళ్ల ముందు బిర్యానీ కనిపిస్తున్నా ఆకలిని చంపుకుని నిలబడ్డారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు విశ్వ, పింకీ ఇద్దరూ కట్టెలు నరకడంలో ఒకరికొకరు పోటీ పడ్డారు. ఇందులో ఎవరు గెలిచారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement