
Sreerama Chandra and Hamida: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ ఆది నుంచే రంజుగా మారింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా కంటెస్టెంట్లు ఓ రేంజ్‌లో పోట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని వాటికి కూడా అతిగా ఆవేశపడుతున్నారు. దీంతో వీరిది నటనా? లేక నిజమా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా వుంటే అందరి పర్సనల్ విషయాలు కూపీ లాగుతున్న కాజల్ ఈసారి సింగర్ శ్రీరామచంద్ర దగ్గర వాలిపోయింది. సేమ్ నీలాంటి అమ్మాయి ఉంటే నచ్చుతుందా? అపోజిట్ ఉంటే నచ్చుతుందా? అని అడిగింది. దీనికి శ్రీరామచంద్ర.. సరదాగా, బబ్లీగా ఉండేవాళ్లు నచ్చుతారు అని బదులివ్వగానే హమీదా మీద ఫోకస్ చేస్తూ హౌస్‌లో ఓ కొత్త లవ్ ట్రాక్ మొదలైందన్నట్లుగా చూపించారు.
'నీకు ఫీలింగ్స్ లేవా? ఏడ్వవా? అని బయట నాఫ్రెండ్స్ అంటుండే వాళ్లు' అని హమీదా చెప్పుకురాగా ఇక్కడ అవన్నీ బయటకు తన్నుకొచ్చేస్తున్నాయని బదులిచ్చాడు సింగర్. ఇద్దరూ ముచ్చట్లలో పడి సరదాగా నవ్వుకున్నారు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. ఎడిటర్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. సాధారణ కబుర్లను కూడా లవ్ యాంగిల్‌లో చూపించడం మీకే చెల్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈసారి అన్నీ కయ్యాలే చూపిస్తున్నారు అనుకునేలోగా పులిహోర విషయాల మీద ఫోకస్ పెట్టాడుగా అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment