
Bigg Boss 5 Telugu Promo: అరుపులు, కొట్లాటలు, బూతులతో బిగ్‌బాస్ హౌస్ అట్టుడికిపోతోంది. మామూలుగానే మాటలతో విరుచుకుపడే కంటెస్టెంట్లు టాస్క్‌ల్లో తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. అయితే మరీ ఈ రేంజ్‌లో కొట్టుకోవడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. కుళాయి దగ్గర నీళ్ల కోసం మహిళలు పెట్టుకునే కొట్లాటల కంటే దారుణంగా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరి అరాచకాన్ని చూడలేకపోతున్నాం, వాళ్లకు అప్పుడప్పుడూ కాస్త పువ్వులను చూపించండ్రా, మరీ వయొలెంట్‌గా ఉన్నారు అని సలహా ఇస్తున్నారు నెటిజన్లు.
ఈ నేపథ్యంలో హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా నడుస్తోందంటూ ప్రోమో వదిలాడు బిగ్‌బాస్. ఈ ప్రోమోలో ఒకే టీములో ఉన్న శ్రీరామచంద్ర, హమీదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కబుర్లాడుతూ కనిపించారు. అంతేకాదు, హమీదాకు మసాజ్ చేస్తున్నాడు శ్రీరామ్. ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ దూరంగా ఉండాలనుకుంటాను అని మనసులో మాట బయట పెట్టింది. దీనికి ఏదోలా ఉందీ వేళ నాలో.. ఈ వింత ఏమిటో.. గిలిగింత ఏమిటో అని బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ సాంగ్ ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. అక్కడ అంత గొడవ జరుగుతుంటే వీళ్లు ఈ గ్యాప్‌లో పులిహోర కలుపుతున్నారు అని కొందరు సెటైర్లు వేస్తుండగా అక్కడ అంత సీనేమీ ఉండదు కానీ దాన్ని ఓ పాటేసి ఓవర్‌గా చూపిస్తున్నారంతే అని తేలికగా తీసిపారేస్తున్నారు. మరి నిజంగానే వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయిందా? లేదా మామూలు ఫ్రెండ్సా? అన్నది తెలియాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment