ఆ గాత్ర మధురం! | RTC MD Fida for the voice of the blind boy | Sakshi
Sakshi News home page

ఆ గాత్ర మధురం!

Published Fri, Nov 15 2024 4:17 AM | Last Updated on Fri, Nov 15 2024 4:17 AM

RTC MD Fida for the voice of the blind boy

చూపులేని బాలుడి గాత్రానికి ఆర్టీసీ ఎండీ ఫిదా.... సినిమాల్లో పాడే అవకాశమివ్వాలని ట్వీట్‌ 

ఇండియన్‌ ఐడల్‌లో ఛాన్స్‌ ఇస్తానని సంగీత దర్శకుడు తమన్‌ హామీ

సాక్షి, హైదరాబాద్‌: పుట్టుకతోనే చూపులేని ఓ బాలుడి పాటకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ మంత్రముగ్ధుడయ్యారు. ఓ బస్సులో కూర్చుని చేతులతో దరువేస్తూ ఆ బాలుడు పాడిన పాట ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. 

దీంతో తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాలో బాలుడి పాట వీడియోను పోస్టు చేసి.. తెలుగు సినిమా పరిశ్రమలో అతడికి ఎవరైనా అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌.. ఆ బాలుడికి ఆహా ఇండియన్‌ ఐడల్‌ 4వ సీజన్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. 

బాలుడితో కలిసి తాను ప్రత్యేకంగా ప్రదర్శన ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆహా టీంను ఆదేశించారు. బాలుడికి అద్భుతమైన ప్రతిభ ఉందని కితాబిచ్చారు. దేవుడు అప్పుడప్పుడూ కఠినంగా వ్యవహరించినా.. ఇలాంటి వారిని ఎంతో ప్రత్యేకంగా చూసుకునేందుకు మంచి మనుషులు ఉండనే ఉన్నారని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement