ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి
దిల్‌సుఖ్‌నగర్‌లో కొత్త కౌంటర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్‌ను గురువారం ఆయ న ప్రారంభించారు.
లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్‌ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు.
ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు...
నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్‌సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment