
బస్సులో టికెట్ తీసుకుంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి బస్సులో ప్రయాణం చేశారు. ప్రయాణికులతో ముచ్చటించారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజగుట్ట వరకు పుష్పక్ బస్సులో ప్రయాణించి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మరిన్ని మెరుగైన సేవలందజేసేందుకు వారి సలహాలు, సూచనలను కోరారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్టీసీల సేవలపైనా ఆరా తీశారు. కాగా, విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్ అంజయ్యను సజ్జనార్ పరామర్శించారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment