సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం ఆయన గ్రేటర్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయని వెల్లడించారు. 2,569 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సైబరాబాద్ పరిధిలో 770 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ప్రతి జీహెచ్‌ఎంసీ సర్కిల్‌కి ఏసీపీ స్థాయి అధికారిని నియమించామని తెలిపారు. (చదవండి: గ్రేటర్ వార్: ముగిసిన నామినేషన్ల పర్వం)
13,500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు 186 మందిని బైండోవర్ చేశామని, 157 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. ‘‘15 చెక్‌పోస్ట్, 11 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశాం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద 10 కెమెరా మోంటెడ్ వెహికల్ ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. సైబరాబాద్‌లో ఉన్న లక్ష కెమెరాలను యాక్టివ్ చేసి నిఘా పట్టిష్టం చేశామని’’ సీపీ సజ్జనార్ వెల్లడించారు. (చదవండి: బరిలో టీఆర్‌ఎస్ గెలుపు గుర్రాలు!)
Comments
Please login to add a commentAdd a comment