సినీ నటుడు సోనూసూద్‌ను సన్మానిస్తున్న సీపీ సజ్జనార్
సాక్షి, రాయదుర్గం: కరోనా వేళ..అభ్యాగులను ఆదుకోవడంలో నేను నిర్వహించిన పాత్ర జీవితంలో మర్చిపోలేనిదని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో సైబరాబాద్ పోలీసులు, సొసెటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా వారియర్స్‌ను బుధవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాజరైన సోనూసూద్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ముంబై తదితర ప్రాంతాల్లో బాధితులను ఆదుకున్న తీరును గుర్తు చేసుకున్నారు. కరోనా చాలా వరకు తగ్గిపోయిందని, అయినా తోటి వారికి సహాయం చేసే పనిని నిరంతరం అందరూ కొనసాగించాలన్నారు.
పోలీసులు, డాక్టర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఇతరులు చాలా మంది కరోనా వేళ ఎంతో సేవ చేశారని, వారంతా రియల్ హీరోస్ అని పేర్కొన్నారు. గాయని స్మిత, సైబరాబాద్ సీపీ సజ్జనార్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తదితరులను ఈసందర్భంగా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ, డీసీపీలు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఈ రిక్షాలు అందించిన రియల్ హీరో
Comments
Please login to add a commentAdd a comment