సాక్షి, హైదరాబాద్: దసరా రద్దీ.. నగరం నుంచి ఏపీ సహా దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ సరీ్వసులన్నీ నిండిపోయాయి. ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో సోమవారం రోజున సీట్లు ఖాళీ లేవని చూపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతాల సరీ్వసుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతమే.
ఎందుకీ తేడా..
ఆరీ్టసీ, ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య ఆక్యుపెన్సీ రేషియోలో తేడాలుండటానికి ప్రధాన కారణం స్లీపర్ సర్వీసులే. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రి పడుకుని ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రైవేట్ ట్రావెల్స్ తమ బస్సుల్లో సింహభాగం స్లీపర్ సర్వీసులుగా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దాదాపు వేయికి పైగా స్లీపర్ సర్వీసులు నడుస్తున్నాయని అంచనా. దీనిపై ఇప్పుడు ఆర్టీసీ కూడా మేల్కొంది. కొత్తగా స్లీపర్ సర్వీసులు సమకూర్చుకోవాలని నిర్ణయించింది.\
ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆరీ్టసీలో పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా స్లీపర్ సర్వీసుల అంశాన్ని ఎండీ ప్రస్తావించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండేందుకు ఇదే ప్రధాన కారణమంటూ అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. గతంలో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులు ప్రారంభించాలని నిర్ణయించినా, ఓ ఉన్నతాధికారి అడ్డుకోవడంతో అది అటకెక్కిందని చెప్పారు.
ఇప్పుడు కొన్ని బస్సులు నడిపితే వాటికి ఆదరణ ఎలా ఉందో తెలుస్తుందని సూచించారు. దీంతో స్లీపర్ సర్వీసులు తీసుకునేందుకు ఎండీ సంసిద్ధత వ్యక్తంచేశారు. కాస్త ఆదాయం మెరుగుపడిన తర్వాత బ్యాంకుల నుంచి కొత్తగా రుణం తీసుకుని కొన్ని స్లీపర్ సరీ్వసులు సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
నాన్ ఏసీ స్లీపర్‌కు గిరాకీ ఎక్కువ..
దాదాపు నాలుగైదేళ్ల క్రితం వరకు ప్రైవేట్ ట్రావెల్స్‌లో సాధారణ బస్సులే ఎక్కువగా ఉండేవి. 20 శాతమే స్లీపర్ బస్సులుండేవి. ప్రయాణికుల నుంచి స్లీపర్‌కు డిమాండ్ పెరగడంతో చాలా బస్సులను ట్రావెల్స్ నిర్వాహకులు స్లీపర్‌లుగా మార్చారు. వీటిల్లోనూ నాన్ ఏసీ బస్సులకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. స్లీపర్ సర్వీసులపై లాభాలెక్కువగా ఉండటంతో క్రమంగా వాటి సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇదే బాటపట్టింది. కాగా, సజ్జనార్ స్లీపర్ బస్సులను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉండటంతో, గరుడ ప్లస్ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్ నమూనాలోకి మార్పు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment