![Tsrtc Has Canceled Family 24 And T6 Tickets - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/31/TSRTC.jpg.webp?itok=Yo1g3xgb)
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ 24, టీ 6 టికెట్లను రద్దు చేస్తూ టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి(జనవరి 1) వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిలుపుదల చేయనునట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది.. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు’’ అని సజ్జనార్ తెలిపారు.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 31, 2023
Comments
Please login to add a commentAdd a comment