
దండేపల్లి(మంచిర్యాల): టీఎస్‌ఆర్టీసీ ఎండీగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రయాణికులు సమస్యలపై దృష్టిపెట్టారు సజ్జనార్. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్‌లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన మార్క్‌ను చూపిస్తున్నారు. తాజాగా మరొక ట్వీట్‌కు సజ్జనార్ స్పందించారు. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వరకు రాత్రి 9గంటల తర్వాత ఆర్టీసీ బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దండేపల్లి మండలం గూడెంకు చెంది తోట పవన్‌వర్మ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మంగళవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
దీనికి ఆయన స్పందించి, ఆర్టీసీ అధి కారి పద్మావతికి పవన్‌వర్మ నంబర్ ఇచ్చి సమస్య తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె పవన్‌వర్మకు ఫోన్ చేసి సమస్య తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ పోస్టుకు స్పందించిన సజ్జనార్‌కు పవన్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు.