
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలు మళ్లీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. యాదాద్రికి భక్తుల తాకిడి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాదాద్రికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు, 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వద్దకు బస్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బస్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని చెప్పారు.
అలాగే, జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి రూ.75 ఛార్జ్ ఉంటుందని తెలిపారు. ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌకర్యవంతంగా యాదాద్రి చేరుకోవచ్చని అన్నారు.
కాగా, శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి తూర్పు దిశలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన 13 ప్రసాదం కౌంటర్ల భవనం నిన్న ప్రారంభమైంది. నిన్న ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.8,17,580 ఆదాయం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment