సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయి. బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్న ఆయన.. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని, యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు.
ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు మీడియాతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం ఎండీ సజ్జనార్‌కు ఐదు సమస్యలను విన్నవించామన్నారు. ఎండీ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 10 వ తేదీ లోపల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో రేపటి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నామని వారు తెలిపారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్ పరామర్శ
Comments
Please login to add a commentAdd a comment