
సాక్షి, హైదరాబాద్: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టిఎస్‌ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు.
నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024
ఇదీ చదవండి: నాంపల్లి: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్