RTC staff
-
గర్భిణికి సాయం చేసిన ఆర్టీసీ సిబ్బందికి సజ్జనార్ సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిటీ బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సాయం అందించి సుఖ ప్రసవానికి కారకులైన సంస్థ కండక్టర్, డ్రైవర్‌ను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీలను హైదరాబాద్ బస్ భవన్లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో జన్మించిన చిన్నారి.. తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఆర్టీసీ బస్సులు, బస్స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు పుట్టిన రోజు కానుకగా బస్ పాస్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ముషీరాబాద్ డిపోకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం ఆరాంఘర్‌లో శ్వేతా రత్నం అనే గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేయడం తెలిసిందే. గర్భిణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. సన్మాన కార్యక్రమంలో సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్ తదితరులు పాల్గొన్నారు. శిశువుకు బర్త్ సర్టిఫికెట్ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ బిడ్డకు భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేశారు. ప్రసవం జరిగిన ప్రదేశం జీహెచ్ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్నందున, జనన ధ్రువ పత్రం ఎక్కడ తీసుకోవాలో అన్న అవగాహన లేక భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు గుర్తించారు. సంబంధిత బర్త్, రిజిస్ట్రార్ ద్వారా బేబీ ఆఫ్ శ్వేతా రత్నం అని పేర్కొంటూ బర్త్ సర్టిఫికెట్ ఇప్పించారు. -
TSRTC: అలాంటి వారిని సహించం.. సజ్జనార్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆయన ట్వీట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిందీ సంఘటన. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదన్నట్టు తిరిగి టిఎస్ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని సజ్జనార్ పేర్కొన్నారు. నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న #TSRTC సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి.… pic.twitter.com/juEpeywb74 — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) January 10, 2024 ఇదీ చదవండి: నాంపల్లి: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ -
ఆర్టీసీలో ‘కారుణ్యం’
మనసున్న పాలకుడి పనితీరు ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి చాటుకున్నారు. 2016–19 మధ్య కాలంలో మరణించిన 1,168 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. – సాక్షి, అమరావతి/కదిరి నాడు చంద్రబాబు ససేమిరా... టీడీపీ అధికారంలో ఉండగా 2016 – 19 మధ్య 1,168 మంది ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందగా కారుణ్య నియామకాల కింద కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారు. ఆర్టీసీ నాడు కార్పొరేషన్‌గానే ఉన్నప్పటికీ కనికరించలేదు. కారుణ్య నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. నేడు మానవత్వంతో.. కారుణ్య నియామకాల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవీయ దృక్పథంతో వ్యవహరించారు. విలీనంతో ఆర్టీసీ ప్రభుత్వ విభాగంగా మారిన తరువాత కూడా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సమ్మతించడం గమనార్హం. 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలను బట్టి 34 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మంది డ్రైవర్లుగా, 445 మందికి శ్రామిక్/ అసిస్టెంట్ మెకానిక్‌లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల హర్షం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు ఆమోదం తెలపడం పట్ల ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి. వివిధ కేటగిరీల్లో 1,168మందికి ఉద్యోగాలు కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై ధన్యవాదాలు తెలియజేశాయి. ఆర్టీసీ ఉద్యోగులపట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందనేందుకు ఇది నిదర్శనమంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దామోదరరావు కృతజ్ఞతలు తెలియజేశారు. -
జీతమెంత.. చేస్తున్న పనెంత?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది పనితీరును సమీక్షించి, ప్రక్షాళన చేసే కార్యక్రమానికి ఆ సంస్థ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. సంస్థలో అధికారుల హోదాకు, వారి పనికి మధ్య హేతుబద్ధత లేకుండా పోయిందని ఆర్టీసీ భావిస్తోంది. కొన్ని పోస్టుల్లో అసలు పనే ఉండటం లేదని.. అయినా జీతాలు అధికంగా ఉన్నాయని గుర్తించింది. మరోవైపు డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లపై మాత్రం విపరీతమైన ఒత్తిడి పడుతోందని తేల్చింది. తక్కువ పనిచేసే కొందరు సిబ్బందికి భారీ జీతాలు ఇస్తుండటం మొత్తంగా సంస్థపై వేతనాల భారాన్ని పెంచుతోందని.. ఈ క్రమంలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఓ హెచ్ఆర్ కన్సల్టెన్సీకి బాధ్యత అప్పగించారని.. ఆర్టీసీకి కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న కేరళకు చెందిన మరో వ్యక్తికి పర్యవేక్షణ బాధ్యత ఇచ్చారని తెలిసింది. డిపో స్థాయి నుంచి పరిశీలన ‘‘ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చాలా మంది సిబ్బందికి డిపోల్లో పనిలేకుండా పోయింది. వారికి ఇతర పనులు అప్పగించాలి’’అని ఇటీవల అధికారులతో సమావేశంలో ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు అందింది. ఇలా పని తక్కువగా ఉండి, జీతం ఎక్కువగా తీసుకుంటున్న పోస్టులు చాలా ఉన్నాయని గుర్తించారు. ఇప్పుడు కన్సల్టెన్సీ సంస్థ డిపో స్థాయి నుంచి ఇలాంటి అంశాలను గుర్తించనుంది. డిపో వ్యవస్థ, అక్కడి సిబ్బంది, వారు చేసే పని అన్నింటిని పరిశీలించి.. ఏయే పోస్టులు అనవసరం, తీసుకుంటున్న జీతాల స్థాయిలో పనిలేని వారు ఎందరు, వారిని ఏయే ఇతర పోస్టుల్లో సర్దుబాటు చేయొచ్చు, అసలు అవసరమే లేని పోస్టులెన్ని, అవసరానికి మించి సిబ్బంది ఉన్నారా, డిపోలకు వాస్తవానికి అవసరమైన సిబ్బంది ఎందరు? వంటి వివరాలను నిర్ధారించి నివేదికను సమర్పించనుంది. దీని ఆధారంగా ఆర్టీసీ ఎండీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీఆర్ఎస్పై దృష్టి.. ఇటీవల ఆర్టీసీ ఆదాయం బాగానే మెరుగుపడినా నష్టాలను అధిగమించలేకపోతోంది. మొత్తం వ్యయంలో జీతాల పద్దు దాదాపు 49 శాతం దాకా ఉండటమే దీనికి కారణంగా ఉంటోంది. కొత్త నియామకాలు ఎటూ లేనందున.. ఉద్యోగ విరమణ రూపంలో సిబ్బంది తగ్గితే జీతాల భారం నుంచి ఉపశమనం కలిగే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వీఆర్ఎస్ (స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) పథకాన్ని ప్రారంభించింది. దాదాపు 650 మంది దీని ద్వారా విరమణ పొందారు. తాజాగా సర్వే ద్వారా మరింత మంది సిబ్బంది వీఆర్ఎస్ తీసుకునేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్కు చేరువై ఎక్కువ జీతాలు పొందుతున్న సిబ్బంది, చేయటానికి పెద్దగా పనిలేని పోస్టుల్లో ఉన్నవారిని వీఆర్ఎస్ వైపు మళ్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. తక్కువ పని ఉండే చోట అవసరమైతే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకోవటం ద్వారా జీతాల భారాన్ని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. -
కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ప్రక్రియ ఇలా.. ► ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20లోగా పూర్తి చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు ఈ నెల 23లోగా పూర్తి చేస్తాయి. ► కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ► ఎంపికైన వారికి ఈ నెల 27లోగా వైద్య పరీక్షలు చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ► కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. క్లాస్–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఉద్యోగ సంఘాల హర్షం.. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
TSRTC: ఆర్టీసీలో వీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ అంశంపై అధికారులు కసరత్తు ప్రారభించారు. ప్రస్తుతం సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఖర్చును తగ్గించాలంటే ఉద్యోగుల సంఖ్యను కుదించటమొక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టడం మినహా గత్యంతరం లేదనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆర్టీసీ ఆర్థిక స్థితిపై వాకబు చేసిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెవెలుగు, సిటీ సర్వీసులతో ఆర్టీసీ స్థితిగతులు ఎప్పటికి మారతాయని, ఆదాయాన్ని అందించే దూరప్రాంత సర్వీసులను ఎందుకు మెరుగుపరచటం లేదని నిలదీశారు. 4 వేల మంది మిగులు ఉద్యోగులు సర్వీసుల సంఖ్య కుదింపు, దాదాపు నాలుగు వేల మంది ఉద్యోగులు ‘మిగులు’గా మారిన విషయం అధికారులు ప్రస్తావించారు. ఆర్టీసీలో కూడా పదవీ విరమణ వయసును రెండేళ్లకు (60 ఏళ్లు) పెంచటం, మిగులు ఉద్యోగులు ఉండటం, రిటైర్మెంట్లు లేకపోవటంతో ప్రొడక్టివిటీ తగ్గి జీతాల భారం పెద్ద సమస్యగా మారిందన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం పరిష్కారమనే తమ అభిప్రాయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలిసింది. 55 ఏళ్లు మొదలు 60 ఏళ్ల వయసు వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్యను మాత్రం ఆయన ప్రశ్నించారు. దానికి అధికారుల వద్ద కచ్చితమైన లెక్కలు లేకపోవటంతో ఉజ్జాయింపు లెక్కలు వెల్లడించారు. తాజాగా ఆయా వివరాలను సీఎంకు సమర్పించేందుకు అధికారులు పక్కాగా లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం తెస్తే భారీగా ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది. అందుకు పెద్ద మొత్తంగా నిధులు కావాలి. దీంతో ఇప్పటికే ఆర్టీసీకి ఉన్న భూములు, వాటిల్లో ఉపయోగంలో ఉన్నవి, ఖాళీగా ఉన్నవి.. తదితర వివరాలను కూడా అధికారులు సిద్ధం చేసి పెట్టారు. ఒకేరోజు రూ.13 కోట్ల ఆదాయం గత ఏడాదిన్నరలో ఎన్నడూ లేనట్టుగా ఆర్టీసీ సోమవారం రోజున రూ.13.04 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. కోవిడ్‌కు ముందు రోజుల్లో ఉన్నట్టుగా ఆదాయం రావటంతో ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 78 శాతం ఆక్యుపెన్సీతో ఈ మొత్తం నమోదైంది. -
ఆర్టీసీ సిబ్బందికి స్కోరింగ్ కార్డులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల పనితీరుపై త్వరలో స్కోరింగ్ కార్డులు జారీ చేయనున్నారు. వారి పనితీరు మెరుగుపరుచుకుని పోటీతత్వం పెంచుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఏపీఎస్ఆర్టీసీకి రూ.30 కోట్లను కేటాయించింది. దీంతో ఆర్టీసీలో త్వరలో ఆన్లైన్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. అనంతరం డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో జారీ చేసే టికెట్ల దగ్గర్నుంచి ఏ రూట్లో వెళుతున్నారు? ఎక్కడెక్కడ బస్సు ఆపారు? తదితర వివరాలన్నీ రియల్ టైమ్‌లో ఆర్టీసీ అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రయాణికుల ఫిర్యాదుల ఆధారంగా డ్రైవర్లు, కండక్టర్ల పనితీరుపై స్కోరింగ్ కార్డుల జారీ చేపడతారు. డ్రైవర్లు, కండక్టర్ల తప్పులుంటే వారికి ఆధారాలతో సహా రియల్ టైమ్‌లో నమోదైన వీడియో ఫుటేజీలో చూపిస్తారు. ఉదాహరణకు ఒక స్టాప్‌లో బస్సును డ్రైవర్ ఆపకుండా వెళ్లాడనుకుంటే, ప్రయాణికుడు ఫిర్యాదు చేస్తే, ట్రాకింగ్‌లో స్పష్టంగా బస్సు ఆపకుండా వెళ్లాడా? లేదా? అనేది కనిపిస్తుంది. అయితే డ్రైవర్లు, కండక్టర్లకు పనిష్మెంట్ ఇవ్వకుండా పనితీరు మెరుగుపరుచుకునేందుకు మాత్రమే ఈ స్కోరింగ్ కార్డులను జారీ చేయనున్నారు. రోజుకు 4 వేల వరకు ఫిర్యాదులు ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు ఫోన్‌కాల్స్ ద్వారా 4 వేల వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. 0866–2570005 నంబర్‌కు అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయి. డ్రైవర్లు, కండక్టర్ల ప్రవర్తన, బస్సు ఆపలేదనే కారణాలపై ఎక్కువ ఫిర్యాదులొస్తున్నాయి. 24 గంటలూ ఆర్టీసీలో 24 మంది సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. మెయిళ్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిపై చేసిన ఫిర్యాదులకు ఆధారాలు ప్రస్తుత విధానంలో ఉండటం లేదు. ఆన్లైన్ ప్రాజెక్టు అమలైతే ఫిర్యాదులపై ఆధార సహితంగా స్కోరింగ్ కార్డులను జారీ చేయడానికి వీలుంటుంది. 40 శాతం మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి ఆన్లైన్ ప్రాజెక్టు ఆరంభం అయ్యాక డ్రైవర్లకు టెక్నాలజీపై శిక్షణ అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీలో 40 శాతం మంది డ్రైవర్లకు శిక్షణ పూర్తి అయిందని ఐటీ విభాగం అధికారులు తెలిపారు. ఆర్టీసీలో డిజిటల్ విధానంపైనా శిక్షణ ఇస్తున్నారు. ఆర్టీసీ కార్యకలాపాలన్నీ రియల్ టైమ్‌లోనే.. ఆర్టీసీలో ఆన్లైన్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. అంతా రియల్ టైమ్‌లోనే పర్యవేక్షణ జరుగుతుంది. ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు స్కోరింగ్ కార్డులు జారీ చేస్తాం. ఈ స్కోరింగ్ కార్డుల ఉద్దేశం వారిని ఇబ్బంది పెట్టాలనేది కాదు. వారి పనితీరు మెరుగుపరుచుకుని ప్రయాణికుల ఆదరణ మరింతగా పెంచుకోవడానికే. రియల్ టైమ్ ద్వారా ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఫిర్యాదులు తగ్గిపోతాయి. ఆర్టీసీ సిబ్బంది తప్పు ఉంటే వారికే స్కోరు తగ్గిపోతుంది. – సుధాకర్, చీఫ్ ఇంజనీర్, ఆర్టీసీ ఐటీ విభాగం -
సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, హన్మకొండ: సొంతింటికి కన్నం వేసిన చందంగా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకు చేరాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. అసలే నష్టాలతో కుదేలైన ఆర్టీసీకి సంస్థకు సిబ్బంది చేతివాటంతో మరింత నష్టం కలిగే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దూర ప్రాంతాలకు నడిపే బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు అదును చూసి కొంత నగదు కాజేస్తున్నారు. ఈ విషయమై కొందరు ప్రయాణికులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చెలా‘మణి’ అవుతోంది. అయితే, ఓ ప్రయాణికుడు తిరగబడడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూడగా... ఓ డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇతర రాష్ట్రాలకు సర్వీసులు వరంగల్ రీజియన్ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్నారు. ఇలా బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ మొత్తంలో సమకూరుతోంది. తద్వారా దూరప్రాంత బస్సులకు అధికా రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, పిడుగురాళ్ల, రాజ మండ్రి, శ్రీశైలం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, మంత్రాలయం, షిర్డీ, పూణే, రాయచూర్‌కు ప్రస్తుతం బస్సులు నడుస్తున్నాయి. అయితే, రాష్ట్రం దాటిన తర్వాత తనిఖీలు ఉండవనే ధైర్యంతో కొందరు కార్మికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవకాశమున్న చోట, అందినకాడికి దోచుకుంటూ ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను బెదిరిస్తున్నారు. తిరుపతి నుంచి వస్తుండగా... ఇటీవల వరంగల్–1 డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్ మీదుగా హన్మకొండకు వచ్చిం ది. ఈ బస్సులో హైదరాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులు కొందరు తిరుపతిలో ఎక్కారు. దూరప్రాంత బస్సు కావడంతో ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వహిస్తారు. ఒకరు బస్సు నడిపితే మరొకరు టిమ్స్ ద్వారా టికెట్లు ఇస్తారు. తిరుపతిలో ఎక్కిన ప్రయాణికుడు, హైదరాబాద్ వాసి జగన్ డబ్బు ఇచ్చినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఈ విషయమై ఎంత ప్రశ్నించినా దాటేస్తూ వచ్చిన డ్రైవర్ కడప వరకు నెట్టుకొచ్చాడు. చివరకు ప్రయాణికుడి నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో పాటు బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు చెప్పడంతో కడప నుంచి హైదరాబాద్ వరకు మాత్రమే టికెట్ ఇచ్చాడు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు టికెట్ డబ్బులు తీసుకుని టికెట్ మాత్రం కడప నుంచి ఇవ్వడం ద్వారా రూ.200 సదరు డ్రైవర్ తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు ప్రయాణికుడు జగన్ ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ గుండా ఫిర్యాదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన డిపో మేనేజర్ చేతి వాటం ప్రదర్శించిన డ్రైవర్ అమరేందర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ దుర్భాషలాడాడు.. ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు డ్రైవర్ అమరేందర్ నాకు ఫోన్ చేస్తూ బెదిరిస్తున్నాడు. ఫోన్లో బూతు పురాణం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన స్నేహితులతోనూ ఫోన్ చేయించి తిట్టించాడు. సదరు డ్రైవర్ నన్ను తిట్టినట్లు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తా. – జగన్, ఫిర్యాదుదారుడు డ్రైవర్‌పై చర్య తీసుకున్నాం.. తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి డ్రైవర్ అమరేందర్‌ను సస్పెండ్ చేశాం. తిరుపతిలో బస్సు ఎక్కిన ప్రయానికుడి వద్ద మొత్తం డబ్బు తీసుకుని కడప నుంచి హైదరాబాద్ వరకు మాత్రమే టికెట్ ఇచ్చాడు. మిగతా డబ్బు కాజేశాడు. అలాగే, ఫిర్యాదు చేసిన ప్రయాణికుడినే దుర్భాషలాడుతున్నట్లు మాకు సమాచారం ఉంది. ఫోన్ రికార్డు వాయిస్ తనకు పంపించాడు. మాటలు వినలేని విధంగా ఉన్నాయి. – గుండా సురేష్, వరంగల్–1 డిపో మేనేజర్ -
బతుక్కి ‘భద్రత’ లేదు!
సాక్షి, హైదరాబాద్: పేరుకు వారు భద్రతా సిబ్బంది.. కాని నిత్యం అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ అధికారి ఆగడాలకు అల్లాడిపోతున్నారు. ఆ అధికారికి మామూళ్లు ఇవ్వకుంటే బదిలీలు.. మాట్లాడితే సస్పెన్షన్.. ప్రశ్నిస్తే డిస్మిస్కు గురవుతున్నారు. ఇదీ ఆర్టీసీలోని భద్రతా సిబ్బంది దుస్థితి. ఆ అధికారి ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ఉత్తర తెలంగాణకు సంబంధించి నిఘా బాధ్యతలు చూసే ఓ అధికారి రిటైర్డ్ అయి తిరిగి అదేపోస్టులో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధుల్లో చేరాడు. అతనికి సిబ్బంది నెలవారీ మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. ఇవ్వకపోతే కక్ష కట్టి ఎడాపెడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ అధికారికి మామూళ్లు ఇచ్చిన వారు ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతారు. వీరంతా బయట ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు’అని ఆరోపిస్తున్నారు. అందుకే, ఆర్టీసీలో నిఘా బాధ్యతలను పర్యవేక్షించాల్సిన కొంతమంది సిబ్బంది ఈ అధికారి అండ చూసుకుని ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. ఈ అధికారి హైదరాబాద్‌లో ఉంటూ వారంలో ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరవుతారని, అత్యవసర ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉంటే హైదరాబాద్‌కే తెప్పించుకుంటారన్నారు. ఆ అధికారి సస్పెండ్ చేసిన సిబ్బంది ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, మరికొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు వాపోతున్నారు. అతనికి అధికారాలే లేవు వాస్తవానికి ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే వారికి కార్మికులను డిస్మిస్ చేసే అధికారాలు లేవని పలువురు సిబ్బంది వాపోతున్నారు. నిజంగా ఆ అధికారికి అధికారాలు ఉంటే... ఆర్టీసీ బోర్డు స్వయంగా అతనికి ప్రత్యేకంగా అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అతని వద్ద ఉండాలని, కాని అవి ఆయన వద్ద లేవని సిబ్బంది వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా బోర్డే పూర్తిస్థాయిలో ఏర్పడలేదని, అలాంటపుడు ఇతనికి డిస్మిస్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు పూర్తిస్థాయి ఎండీ లేడన్న ధీమాతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది ఆ అధికారి వ్యవహారంపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని, ఆయనపై చర్యల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
రామచంద్రపురం: ఎవరో ఏమిటో తెలియదు.. కానీ రామచంద్రపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తుది శ్వాస విడిచాడు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది చలించిపోయారు. వివరాల్లోకి వెళితే రామచంద్రపురం ఆర్టీసీ బస్ డిపోలో ఒక వ్యక్తి అనారోగ్యంతో తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. ఇది గమనించిన తపాలా శాఖకు చెందిన ఆర్.శ్రీనివాస్, వాసు 108కి ఫోన్ చేశారు. హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీనితో మృతి చెందిన వ్యక్తికి తోడుగా వచ్చిన అత్తగారు బోరున విలపించింది. తమది గుంటూరని, తన అల్లుడు నేలటూరి శ్రీను(45) కొంతకాలంగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, వెల్ల కామెర్ల మందు కోసం వచ్చిన తాము మందు తీసుకుని తిరుగు ప్రయాణం నిమిత్తం ఇక్కడకు చేరుకున్నట్లు తెలిపింది. ఇది విన్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల్లో మానవత్వం మేలుకొంది. ఆర్టీసీ డీఎం సీతారామస్వామినాయుడు ఆధ్వర్యంలో ఎన్వీ రమణ, ఆర్టీసీ సిబ్బంది, కాంప్లెక్స్‌లో ఉన్న ఇతర ప్రయాణికులు ఎలాగైనా మృతదేహాన్ని గుంటూరు కుటుంబం చెంతకు చేర్చాలని తలచారు. దీనితో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది స్వచ్ఛందంగా సుమారు రూ. 11 వేలు విరాళాలు అందజేశారు. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది అందజేసిన సొమ్మును మృతుడు శ్రీను అత్తగారు అంకాల మరయమ్మకు డీఎం సీతారామస్వామినాయుడు చేతుల మీదుగా అందజేసి, అంబులెన్స్‌లో మృతదేహం గుంటూరుకు చేరేవిధంగా ఏర్పాటు చేశారు. మరియమ్మ వారి మానవత్వానికి చేతులెత్తి నమస్కరించి తన అల్లుడి మృతదేహంతో గుంటూరుకు ప్రయాణమైంది. ఇది చూసినవారి గుండెలు బరువెక్కాయి. -
తొలగించిన కాలానికీ జీతం చెల్లించాలి
ఆర్టీసీ ఉద్యోగి తొలగింపు కేసులో హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తొలగించిన ఉద్యోగులపై ఆరోపణలు నిరూపణ కానప్పుడు వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. తొలగించిన కాలానికి జీతం కూడా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిం ది. ఆర్టీసీ ఉద్యోగి తొలగింపునకు సంబంధించిన కేసులో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉద్యోగుల తొలగింపు కేసుల్ని కింది కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వారిని ఆర్టీసి తిరిగి విధుల్లోకి తీసుకున్నా, తొలగింపు కాలానికి జీతం, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలని న్యాయ మూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి ప్రస్తుతించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అమీనాపూర్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కె.నర్సయ్య హన్మ కొండ–నిజామాబాద్ రూట్లో బస్సు నడుపుతుండగా ట్రాక్టర్‌ను ఢీకొంది. 2005 జనవరి 30 జరిగిన ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా బస్సును నడిపారన్న ఆరోపణలపై తొలుత సస్పెన్షన్, అదే ఏడాది సెప్టెంబర్ 2న సర్వీస్ నుంచి తొలగిస్తూ ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నర్సయ్యపై క్రిమినల్ కేసును 2009 జూలైలో కామారెడ్డి కోర్టు కొట్టేసింది. అదే సమయంలో నర్సయ్య హైదరాబాద్ లేబర్ కోర్టు–2ను ఆశ్రయించగా... ఆర్టీసీ ఆరోపణల్ని కొట్టివేస్తూనే, పనిచేయని కాలానికి జీతం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2011 ఫిబ్రవరిలో తిరిగి విధుల్లోకి చేరిన నర్సయ్య హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఆరోపణల్ని కామారెడ్డి కోర్టు కొట్టేసిందని, కనుక పనిచేయని కాలానికి జీతం తోపాటు ఇంక్రిమెంట్లు కూడా ఇచ్చేలా ఆదేశా లివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదిం చారు. తొలగించిన కాలానికి జీతం, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆర్టీసీని ఆదేశించారు. -
ఆ.. విజయవాడ.. విజయవాడ..
ఇక స్టేజీల్లో అరిచి ప్రయాణికులను పిలవనున్న ఆర్టీసీ సిబ్బంది దూర ప్రాంత బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘కూకట్పల్లి.. కూకట్పల్లి.. మియాపూర్.. మియాపూర్..’ అంటూ హైదరాబాద్ నగరంలో సెట్విన్ సర్వీసు బస్సు కండక్టర్లు అరు స్తుంటారు. ప్రయాణికులను బస్సులో ఎక్కించు కునేందుకు వారు అలా చేస్తుంటారు. ఇప్పుడు దూర ప్రాంతాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లు కూడా అలాగే అరుస్తూ ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న గరుడ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో సగటు 65 శాతంగా నమోదవుతోంది. ఈ లెక్క ప్రకారం 35 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నమాట. అలాగే సూపర్ లగ్జరీ సగటు 70 శాతంగా ఉంది. దీన్ని కనీసం ఐదు శాతానికి పెంచితే ఆదాయం గణ నీయంగా నమోదవుతుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఆమేరకు డిపో స్థాయి అధికారు లకు కొత్త టార్గెట్లు నిర్దేశిస్తోంది. గరుడ బస్సులకు 70 శాతం, సూపర్‌లగ్జరీ బస్సులకు 75 శాతంగా లక్ష్యాన్ని ఖరారు చేసింది. ప్రయోగాత్మకంగా బీహె చ్‌ఈఎస్, మియాపూర్ డిపోలలో ప్రారంభించింది. డ్రైవర్లలో చైతన్యం.. ఆర్టీసీ కోసం గట్టిగా పనిచేస్తేనే లాభాల రుచి చూసే అవకాశం ఉంటుందని యాజమాన్యం కొన్ని రోజు లుగా సిబ్బందిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు బస్సుల తరహాలో.. స్టాపుల్లో ఆగినప్పుడు బస్సు ఏ ప్రాంతా నికి వెళ్తుందో ఆ ప్రాంతం పేరును గట్టిగా ఉచ్చ రిస్తూ ప్రయాణికులను పిలవాలని సూచించింది. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్న విషయం తెలియక ప్రయాణికులు ఎక్కటం లేదని ప్రత్యక్ష పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంత బస్సుల్లో ఉండే రెండో డ్రైవర్ స్టాపులో ఆగగానే గట్టిగా అరిచి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిం చాలని ఆదేశించారు. బస్సులను శుభ్రంగా ఉంచటంతోపాటు, సమయపాలన పాటించటం ద్వారా ఆర్టీసీపై సదాభిప్రాయం పెరిగి ప్రయాణికులను ఆకర్షించాలని ఆదేశించారు. ఒకేసారి రెండు బస్సులు వస్తే, ఒక బస్సును పది నిమిషాలపాటు ఆపి రెంటి మధ్య సమయంలో తేడా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇలా ఆదేశాలను పాటించి సత్ఫలితాలు సాధించే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. త్వరలో దీన్ని అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. -
చార్జీ తక్కువ.. మన బస్సే ఎక్కండి ..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. పొరుగు రాష్ట్రాల టిక్కెట్టు చార్జీలు.. టీఎస్ ఆర్టీసీ టిక్కెట్టు చార్జీలలో వ్యత్యాసాన్ని ప్రయాణికులకు వివరించి.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 54 లక్షల చొప్పున నష్టం వస్తుందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మూడు డివిజన్ల పరిధిలో 11 రీజి యన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 95 డిపోలలో 10,521 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాష్ట్ర పరిధితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికంగా మన బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీకి వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు తిరుగు ప్రయాణంలో చాలావరకు ఖాళీగా వస్తున్నాయి. దీంతో తీవ్రంగా నష్టాల్ని చవిచూడాల్సి వస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ కంటే టీఎస్ ఆర్టీసీలో టిక్కెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని ప్రయాణికులకు వివరించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు సూచించారు. ఈ క్రమంలో డిపో మేనేజర్లు తమ పరిధిలో నడిచే బస్సులలో చార్జీల తీరు.. అదేవిధంగా ఇవే రూట్లలో నడిచే ఏపీఎస్ ఆర్టీసీ చార్జీలతో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు రూపొందించారు. వీటిని బస్‌స్టాప్‌ల వద్ద ప్రయాణికులకు కనిపించే విధంగా ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్ రూట్లో నడిచే దేవరకొండ డిపో బస్సుల చార్జీలు, ఇదే రూట్లో నడిచే ఆంధ్రప్రదేశ్ బస్సు చార్జీలు పేర్కొంటూ సైదాబాద్, సాగర్ రింగ్‌రోడ్ బస్‌స్టాపుల్లో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సు చార్జీలో రూ.8, డీలక్స్ బస్ చార్జీల్లో రూ. 9 చొప్పున వ్యత్యాసం ఉన్నట్లు ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇలా బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. -
డ్రైవర్ల ప్రోత్సాహకాలు స్వాహా
♦ ఆర్టీసీలో మరో ‘చిల్లర కొట్టుడు’ ♦ కరీంనగర్ జిల్లాలో బయటపడ్డ బాగోతం ♦ అన్ని డిపోల్లో విచారణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సు బిల్లులు.. బస్టాండ్లలోని దుకాణాల అద్దెలు.. ఇలా ఆర్టీసీ ఖజానాకు చేరాల్సిన సొమ్మును గుటుక్కుమనిపిస్తున్న ఆర్టీసీ సిబ్బంది చివరకు కార్మికుల అలవెన్సులనూ వదిలిపెట్టడం లేదు. పనితీరులో మంచి ప్రతిభను కనబరిచిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు చెల్లించే అలవెన్సును స్వాహా చేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోలో ఈ తతంగం బయటపడటంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అన్ని డిపో ల్లో తనిఖీలు చేపట్టారు. ఆ డిపోలో బాధ్యుడిగా గుర్తించి న సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసి పోలీసు కేసు నమోదు చేశారు. హుజురాబాద్ డిపోకు ఇలా వచ్చిన మొత్తంలో 49 వేలను స్వాహా చేసినట్లు ఆడిటింగ్‌లో బయటపడింది. అధికారులు ఆ మొత్తాన్ని రికవరీ చేసి సంబంధిత డ్రైవర్లకు పంపిణీ చేశారు. మిగతా డిపోల్లో విచారణ జరుగుతున్నందున మరో రెండుమూడు రోజు ల్లో వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఇటీవల ఇ లాంటి ‘చిల్లరకొట్టుడు’ వ్యవహారాలు వెలుగుచూస్తుం డటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న యాజమాన్యం ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే విజిలెన్సు విభాగంతో విచారణ జరిపి నిగ్గుతేలుస్తోంది. అయితే అధికారులపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేస్తుండటం మాత్రం విమర్శలకు కారణమవుతోంది. డ్రైవర్లకు అవగాహన లేక: బస్సులను జాగ్రత్తగా నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆర్టీసీ యాజమాన్యం పదేపదే డ్రైవర్లకు సూచిస్తోంది. అలా సురక్షిత డ్రైవింగ్ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ప్రత్యేక అలవెన్సు ఇస్తోంది. ఇది తోటి డ్రైవర్లను ఆకట్టుకుని వారు కూడా సురక్షితంగా బస్సులను నడిపేందుకు దోహదం చేస్తుందనేది దీని ఉద్దేశం. గరిష్టంగా రూ.2,400 వరకు ఒక్కో డ్రైవర్‌కు చెల్లిస్తారు. ప్రతి ఏటా అలాంటి వారిని గుర్తించి అంతమేర నిధులను డిపోలవారీగా పంపిణీ చేస్తారు. ఏడాదికి ఒకసారే చెల్లించే మొత్తం కావటంతో... ఏ డ్రైవరుకు ఆ మొత్తం వచ్చిందనే విషయంలో పెద్దగా అవగాహన ఉండట్లేదు. దీంతో ఆ మొత్తం అందకున్నా అడిగేవారుండటం లేదు. దీన్ని ఆసరా చేసుకుని కొందరు సిబ్బంది ఆ సొమ్మును జేబులో వేసుకున్నట్టు తెలుస్తోంది. -
పండుగ పూట పైసలు ఖతమ్!
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో రాజ్‌కుమార్ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ‘దసరా’ హడావుడి వల్ల తీరిక లేకపోవడంతో పండుగకు ముందు రోజు బుధవారం (21వ తేదీ) సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి షాపింగ్‌కు వెళదామని అనుకున్నాడు. అయితే బుధవారం ఉదయం విధుల్లో ఉన్న రాజ్‌కుమార్‌కు.. ఎస్బీహెచ్ సిబ్బంది అంటూ హిందీలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీ ఏటీఎం కార్డు రెన్యువల్ డేట్ అయిపోతోంది. మరో రెండు నిమిషాల్లో మీ ఖాతా నుంచి లావాదేవీలు నిలిచిపోతాయి. మీ కార్డు వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి. మీ ఏటీఎం కార్డు మీద ఉన్న 16 డిజిట్ నంబర్లు చెప్పండి’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి కోరాడు. పండుగ పూట ఇదేం గోల.. ఒకవేళ నిజంగా ఖాతా నిలిచిపోతే మొదటికే మోసం వస్తుందని భావించిన రాజ్‌కుమార్ ఆ నంబర్లు చెప్పేశాడు. ఆ తర్వాత వారి మాటలను నమ్మి సీవీవీ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ కూడా ఇచ్చేశాడు. ‘మీ సెల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. తిరిగి వెంటనే కాల్ చేస్తా’ అని ఫోన్ పెట్టేశాడు. కాల్ కట్ అయ్యిందో లేదో ఓటీపీ వచ్చింది. మళ్లీ కాల్ చేసి ఓటీపీ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే ‘మీరు రూ.47 వేలు ఆన్లైన్ షాపింగ్ చేశారు’ అంటూ ఎస్ఎంఎస్ వచ్చింది. దీంతో రాజ్‌కుమార్ లబోదిబోమన్నాడు. అతని కుటుంబానికి పండుగ సంబురం లేకుండా పోయింది. ఈ నెల 21న రాజ్‌కుమార్‌కు ఫోన్ కాల్ వస్తే.. అదే డిపోకు చెందిన మరో ముగ్గురు లక్ష్మీ శేఖర్(రూ.28 వేలు), తిరుపతిరావు(రూ.10 వేలు), ఎస్ఏ చారి(రూ. 5,500)లకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ 23, 24 తేదీల్లో రావడంతో మోసమని గుర్తించిన నలుగురూ సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇదే డిపోకు చెందిన మరో ముగ్గురు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. వీరంతా కలసి సుమారు రూ. లక్ష వరకూ మోసపోయినట్టు సమాచారం. 30 మందికి కాల్స్.. ఇదే డిపోకు చెందిన దాదాపు 30 మందికి ఫోన్ కాల్స్ వచ్చినట్టు సమాచారం. అయితే కొంతమంది అప్రమత్తమై ఎటువంటి వివరాలు ఇవ్వకపోగా.. మరికొంత మంది సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి పూర్తి వివరాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే నలుగురిలో చులకనవుతామనే ఉద్దేశంతో కొంత మంది ముందుకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కాగా, ఆర్టీసీ డిపో సిబ్బంది వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడంపై సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది బిహార్, జార్ఖండ్ ముఠాల పనిగా అనుమానిస్తున్నారు. మోసపోకండి.. క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు అప్డేట్ చేస్తామంటూ ఫోన్లు వచ్చినా, తక్కువ వడ్డీకే రుణం ఇస్తామంటూ ఈ-మెయిల్స్ వచ్చినా, ఏటీఎం కార్డు వెరిఫికేషన్ కోసం ఆధార్‌తో అనుసంధానం చేస్తామన్నా, షాపింగ్ చేయడం వల్ల వచ్చే రివార్డు పాయింట్లను ఖాతాలకు బదిలీ చేస్తామన్నా, క్రెడిట్ ఫెసిలిటీ రూ.50 వేల వరకు ఉంటే దాన్ని రూ. లక్ష వరకు పెంచుతామని.. వచ్చే కాల్స్ నిజమైనవి కావని, ఇటువంటి ఫోన్ కాల్స్‌ను నమ్మి ప్రజలు మోసపోవద్దని సైబరాబాద్ సైబర్ విభాగం ఏసీపీ జయరాం కోరారు. -
మళ్లీ కోతపెడితే మెరుపు సమ్మె
కార్మికుల జీతాల్లో కోతతో కొత్త బస్సుల కొనుగోలుపై కార్మికుల భగ్గు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరికతో ఆర్టీసీ యాజమాన్యం వెనుకడుగు గత నెలలో ఇలాగే 24 బస్సుల కొనుగోలు హైదరాబాద్: వేతనాల్లో కోతపెట్టి కొత్త బస్సులు కొనాలనే ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. గత నెలలో ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని మినహాయించిన అధికారులు వాటితో 24 కొత్త బస్సులు కొన్నారు. ఒక్క నెల, ఒక్కరోజే కదా అని అప్పట్లో కార్మికులు పెద్దగా నిరసన తెలపలేదు. కానీ, దాన్ని ఏకంగా ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం జూన్ నెల వేతనాల్లో కూడా కోత పెట్టేందుకు సిద్ధమైందన్న సంగతి తెలిసి కార్మికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నెలవారీ కోత రూ.4.5 కోట్లు...: తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడం భారంగా మారింది. దీంతో సిబ్బంది ‘చేయూత’తో గట్టెక్కేలా ఉన్నతాధికారి ఒకరు యాజమాన్యం ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతినెలా సిబ్బంది వేతనాల్లోంచి ఒకరోజు మొత్తాన్ని మినహాయిస్తే రూ.4.5 కోట్లు జమవుతుందని, దీంతో ప్రతినెలా జిల్లాకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి)ఓ బస్సు చొప్పున కొనవచ్చనేది ఆ ప్రతిపాదన. ఇదేదో బాగుందనుకున్న యాజమాన్యం గుర్తింపు పొందిన యూనియన్ నేతలతో భేటీ నిర్వహించి విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చింది. ఒకరోజు వేతనంతో ఏకంగా 24 బస్సులు కొనే అవకాశం ఉండడంతో దానికి వారు కూడా సరేనన్నారు. దీంతో మే నెలలో ఒకరోజు కోతపెట్టి రూ.4.5 కోట్లతో 24 బస్సులు కొన్నారు. కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనా యూనియన్ నాయకులు సర్దిచెప్పారు. అయితే, జీతంలో కోత నిర్ణయాన్ని ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్న అధికారులు జూన్ నెలలోనూ కట్ చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలోనే కార్మికులను అతికష్టమ్మీద ఒప్పించామని, ఇప్పుడు ఏకంగా 12 నెలల పాటు కోతపెడతామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కొత్త బస్సులను ప్రభుత్వ నిధులతోనో, గ్రాంట్లతోనే, కేంద్రం సాయంతోనే కొనాలి తప్ప ఇలా కార్మికుల వేత నాలతో కొనడం సరికాదంటూ మెరుపు సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు జీతంలో కోత పెట్టడం లేదంటూ ప్రకటించారు. -
ఆర్టీసీ కార్మికులకు దసరా బోనస్ ఇవ్వాలి