ఆ.. విజయవాడ.. విజయవాడ.. | Measures to increase the occupancy ratio of long-distance buses | Sakshi
Sakshi News home page

ఆ.. విజయవాడ.. విజయవాడ..

Published Mon, Feb 6 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

ఆ.. విజయవాడ.. విజయవాడ..

ఆ.. విజయవాడ.. విజయవాడ..

  • ఇక స్టేజీల్లో అరిచి ప్రయాణికులను పిలవనున్న ఆర్టీసీ సిబ్బంది
  • దూర ప్రాంత బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు
  • సాక్షి, హైదరాబాద్‌: ‘కూకట్‌పల్లి.. కూకట్‌పల్లి.. మియాపూర్‌.. మియాపూర్‌..’ అంటూ హైదరాబాద్‌ నగరంలో సెట్విన్‌ సర్వీసు బస్సు కండక్టర్లు అరు స్తుంటారు. ప్రయాణికులను బస్సులో ఎక్కించు కునేందుకు వారు అలా చేస్తుంటారు. ఇప్పుడు దూర ప్రాంతాలకు తిరిగే గరుడ, సూపర్‌ లగ్జరీ బస్సుల డ్రైవర్లు కూడా అలాగే అరుస్తూ ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గరుడ, సూపర్‌ లగ్జరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది.

    ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న గరుడ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో సగటు 65 శాతంగా నమోదవుతోంది. ఈ లెక్క ప్రకారం 35 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నమాట. అలాగే సూపర్‌ లగ్జరీ సగటు 70 శాతంగా ఉంది. దీన్ని కనీసం ఐదు శాతానికి పెంచితే ఆదాయం గణ నీయంగా నమోదవుతుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఆమేరకు డిపో స్థాయి అధికారు లకు కొత్త టార్గెట్లు నిర్దేశిస్తోంది. గరుడ బస్సులకు 70 శాతం, సూపర్‌లగ్జరీ బస్సులకు 75 శాతంగా లక్ష్యాన్ని ఖరారు చేసింది. ప్రయోగాత్మకంగా బీహె చ్‌ఈఎస్, మియాపూర్‌ డిపోలలో ప్రారంభించింది.

    డ్రైవర్లలో చైతన్యం..
    ఆర్టీసీ కోసం గట్టిగా పనిచేస్తేనే లాభాల రుచి చూసే అవకాశం ఉంటుందని యాజమాన్యం కొన్ని రోజు లుగా సిబ్బందిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు బస్సుల తరహాలో.. స్టాపుల్లో ఆగినప్పుడు బస్సు ఏ ప్రాంతా నికి వెళ్తుందో ఆ ప్రాంతం పేరును గట్టిగా ఉచ్చ రిస్తూ ప్రయాణికులను పిలవాలని సూచించింది. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్న విషయం తెలియక ప్రయాణికులు ఎక్కటం లేదని ప్రత్యక్ష పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంత బస్సుల్లో ఉండే రెండో డ్రైవర్‌ స్టాపులో ఆగగానే గట్టిగా అరిచి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిం చాలని ఆదేశించారు.

    బస్సులను శుభ్రంగా ఉంచటంతోపాటు, సమయపాలన పాటించటం ద్వారా ఆర్టీసీపై సదాభిప్రాయం పెరిగి ప్రయాణికులను ఆకర్షించాలని ఆదేశించారు. ఒకేసారి రెండు బస్సులు వస్తే, ఒక బస్సును పది నిమిషాలపాటు ఆపి రెంటి మధ్య సమయంలో తేడా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇలా ఆదేశాలను పాటించి సత్ఫలితాలు సాధించే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. త్వరలో దీన్ని అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement