Bus occupancy ratio
-
పుంజుకున్న ఆర్టీసీ.. లాభాలబాట పట్టించిన శుభ ముహూర్తాలు
శుభ ముహూర్తాలు ఆర్టీసీని లాభాల బాటపట్టించాయి. ఏప్రిల్‌లో రోజువారీ సగటు ఆదాయం రూ.11.50 కోట్లకు పడిపోయి జీతాలిచ్చేందుకు సంస్థ ఇబ్బందిపడ్డ పరిస్థితి మారి.. ప్రస్తుతం రోజువారీ సగటు ఆదాయం రూ.15.50 కోట్లుగా నమోదవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారి 45 డిపోలు లాభాల్లోకి చేరాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 74 శాతంగా నమోదవుతోంది. శుభముహూర్తాలు కొనసాగినన్ని రోజులు పరిస్థితి మెరుగ్గా ఉండనుంది. అలాగే, రానున్న వానాకాలంలోనూ ఓఆర్ పడిపోకుండా చూడాలని ఆర్టీసీ భావిస్తోంది. రికార్డు స్థాయి లాభాలతో.. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడిన స్వల్ప కాలానికే ఏకంగా 44 శాతం ఫిట్ మెంట్‌తో వేతన సవరణ జరిగింది. దీంతో ఆర్టీసీపై సాలీనా రూ.850 కోట్ల భారం పడింది. అనంతరం పర్యవేక్షణ లోపించడంతో ఆర్టీసీ పనితీరు దిగజారింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన నష్టాల కంటే తెలంగాణ ఆర్టీసీ నష్టాలు పెరిగిపోయాయి. డిపోలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇన్నాళ్లకు తొలిసారి 96 డిపోలకు 45 డిపోలు లాభాల్లోకి వచ్చాయి. ఏప్రిల్‌లో శుభకార్యాలు లేకపోవడంతో ఓఆర్ 58 శాతానికి పడిపోయి, రోజు వారీ ఆదాయం సగటున రూ.11.50 కోట్లకు పరిమితమైంది. మేలో ముహూర్తాల కాలం ప్రారంభం కావటంతో ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ పుంజుకుంది. ఆదాయం రూ.16 కోట్లను మించి నమోదుకాగా, సగటున వారం రోజులుగా రూ.15.50 కోట్ల మేర వస్తోంది. లాభాల్లో ఉన్న డిపోలు ఇవే.. షాద్‌నగర్, తొర్రూరు, ఆదిలాబాద్, అచ్చంపేట, తాండూరు, జనగామ, వేములవాడ, బీహెచ్ఈఎల్, మహేశ్వరం, మెట్పల్లి, మధిర, నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, నార్కెట్‌పల్లి, సూర్యాపేట, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, పరిగి, నారాయణపేట, సిరిసిల్ల, కొత్తగూడెం, జగిత్యాల, మణుగూరు, గద్వాల, కరీంనగర్–1, భద్రాచలం, నల్లగొండ, సత్తుపల్లి, కోదాడ, దేవరకొండ, వరంగల్–1, పికెట్, యాదగిరిగుట్ట, హైదరాబాద్–2, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వనపర్తి, హైదరాబాద్–1, మియాపూర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, నారాయణ్‌ఖేడ్. చదవండి: ప్రియాంక ‘యువ సంఘర్షణ సభ’.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు -
ఆ.. విజయవాడ.. విజయవాడ..
ఇక స్టేజీల్లో అరిచి ప్రయాణికులను పిలవనున్న ఆర్టీసీ సిబ్బంది దూర ప్రాంత బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘కూకట్పల్లి.. కూకట్పల్లి.. మియాపూర్.. మియాపూర్..’ అంటూ హైదరాబాద్ నగరంలో సెట్విన్ సర్వీసు బస్సు కండక్టర్లు అరు స్తుంటారు. ప్రయాణికులను బస్సులో ఎక్కించు కునేందుకు వారు అలా చేస్తుంటారు. ఇప్పుడు దూర ప్రాంతాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లు కూడా అలాగే అరుస్తూ ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న గరుడ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో సగటు 65 శాతంగా నమోదవుతోంది. ఈ లెక్క ప్రకారం 35 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నమాట. అలాగే సూపర్ లగ్జరీ సగటు 70 శాతంగా ఉంది. దీన్ని కనీసం ఐదు శాతానికి పెంచితే ఆదాయం గణ నీయంగా నమోదవుతుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఆమేరకు డిపో స్థాయి అధికారు లకు కొత్త టార్గెట్లు నిర్దేశిస్తోంది. గరుడ బస్సులకు 70 శాతం, సూపర్‌లగ్జరీ బస్సులకు 75 శాతంగా లక్ష్యాన్ని ఖరారు చేసింది. ప్రయోగాత్మకంగా బీహె చ్‌ఈఎస్, మియాపూర్ డిపోలలో ప్రారంభించింది. డ్రైవర్లలో చైతన్యం.. ఆర్టీసీ కోసం గట్టిగా పనిచేస్తేనే లాభాల రుచి చూసే అవకాశం ఉంటుందని యాజమాన్యం కొన్ని రోజు లుగా సిబ్బందిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు బస్సుల తరహాలో.. స్టాపుల్లో ఆగినప్పుడు బస్సు ఏ ప్రాంతా నికి వెళ్తుందో ఆ ప్రాంతం పేరును గట్టిగా ఉచ్చ రిస్తూ ప్రయాణికులను పిలవాలని సూచించింది. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్న విషయం తెలియక ప్రయాణికులు ఎక్కటం లేదని ప్రత్యక్ష పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంత బస్సుల్లో ఉండే రెండో డ్రైవర్ స్టాపులో ఆగగానే గట్టిగా అరిచి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిం చాలని ఆదేశించారు. బస్సులను శుభ్రంగా ఉంచటంతోపాటు, సమయపాలన పాటించటం ద్వారా ఆర్టీసీపై సదాభిప్రాయం పెరిగి ప్రయాణికులను ఆకర్షించాలని ఆదేశించారు. ఒకేసారి రెండు బస్సులు వస్తే, ఒక బస్సును పది నిమిషాలపాటు ఆపి రెంటి మధ్య సమయంలో తేడా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇలా ఆదేశాలను పాటించి సత్ఫలితాలు సాధించే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. త్వరలో దీన్ని అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు.