మండల కేంద్రానికి వచ్చిన బస్సు
సాక్షి, సిరికొండ(ఆదిలాబాద్): ట్విట్టర్‌లో పోస్టు చేయగానే సిరికొండకు బస్సు వచ్చింది. ఆర్టీసీ అధికారులు కొంతకాలంగా మండల కేంద్రానికి బస్సు నిలిపివేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ మౌనిక, సిరికొండకు చెందిన గుగ్గిళ్ల స్వామి ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పోస్టు చేశారు. స్పందించిన సజ్జనార్ బస్సు నడిపించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం మండల కేంద్రానికి బస్సు పునరుద్ధరించారు.
Comments
Please login to add a commentAdd a comment