Special Bus
-
Sajjanar: ట్విట్టర్‌తో సిరికొండకు బస్సు
సాక్షి, సిరికొండ(ఆదిలాబాద్): ట్విట్టర్లో పోస్టు చేయగానే సిరికొండకు బస్సు వచ్చింది. ఆర్టీసీ అధికారులు కొంతకాలంగా మండల కేంద్రానికి బస్సు నిలిపివేశారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ మౌనిక, సిరికొండకు చెందిన గుగ్గిళ్ల స్వామి ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు పోస్టు చేశారు. స్పందించిన సజ్జనార్ బస్సు నడిపించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం మండల కేంద్రానికి బస్సు పునరుద్ధరించారు. -
మహిళల కోసం రూ.12 లక్షల బస్సు
బెంగళూరు : కేఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సును అన్ని సదుపాయాలతో మహిళల టాయ్‌లెట్‌గా రూపొందించారు. అంతేకాదు ఇందులో శిశువులకు పాలిచ్చే గది, శానిటరి న్యాప్కిన్ వెండింగ్ మిషన్, బిడ్డ డైపర్ మార్చే స్థలం, సోలార్ దీపాలతో బహుళ ప్రయోజన బస్సుగా మార్చారు. ఇందుకు రూ.12 లక్షలు వ్యయమైంది. గురువారం డీసీఎం లక్ష్మణ సవది ప్రారంభించారు. బస్సును నగరంలో రద్దీ కూడళ్లలో మహిళల కోసం నిలిపి ఉంచుతారు. -
ఇంటర్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలను కలుపుకుని పరీక్షలను విజయవంతం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. అనంతరం పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలన్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పారదర్శక రీతిలో సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల ఇంటర్ పరీక్షల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులు పరీక్షలపై శ్రద్ధ వహించాలన్నారు. (చక్రం తిప్పిన సబితమ్మ : అనూహ్యంగా యువనేతకు పట్టం) -
దసరా బాదుడు
♦ దసరా స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ ♦ పేద, మధ్య తరగతిపై 50 శాతం అదనపు భారం ♦ 22వ తేదీ నుంచి ప్రత్యేక సర్వీసులు ♦ రద్దీని బట్టి టికెట్ రేటు, అదనపు సర్వీసులు సరదాల పండుగ దసరాకు రవాణా భారం ప్రజలను బెంబేలెత్తిస్తుంది. ప్రయాణికుల అవసరాన్ని ఆర్టీసీ కూడా సొమ్ము చేసుకుంటోంది. సాధారణ రోజులకంటే చార్జీలను అదనంగా పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అసలు పండుగకు ఊరెళ్లాలా.. వద్దా అనే మీమాంస పడిపోయారు సామాన్య ప్రజలు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రత్యేక బస్సులు సైతం రయ్..రయ్ మనేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ప్రైవేటు వాహనదారులు భారీ దోపిడీకి తెరలేపారు. అదనపు చార్జిలు అనేందుకు అవకాశం లేకుండా ఆర్టీసీ సైతం ఫ్లెక్సీ ఫేర్ (రద్దీ రోజును బట్టి టిక్కెట్ రేటు నిర్ణయించడం) విధానం అమలు చేస్తుండడంతో ప్రైవేటు వాహనదారుల హవాకు ఇక కళ్లెం వేయడం కష్టం అనే భావన వ్యక్తమవుతోంది. ఒంగోలు: దసరా పండుగకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారి కోసం ఆర్టీసీ భారీగానే ఏర్పాట్లు చేపట్టింది. హైదరాబాద్ నుంచే ప్రయాణికులు అధికంగా వస్తుండడంతో దీని కోసం ఏ తేదీ, ఏ డిపో నుంచి ఎన్ని సర్వీసులు నడపాలో కూడా నిర్ణయించేసింది. ఈనెల 22వ తేదీ నుంచి జిల్లాలోని 8 డిపోల నుంచి నాన్ ఏసీ సర్వీసులైన ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులను ప్రత్యేక బస్సుల రూపంలో నడపాలని నిర్ణయించింది. ఏసీ సర్వీసులైన ఇంద్ర, గరుడ, అమరావతి సర్వీసులకు మాత్రం ఫ్లెక్సీ ఫేర్‌తో కొంతమేర మాత్రమే వడ్డించి ఉన్నత వర్గాలను ఆకట్టుకునేందుకు యత్నించింది. డిపోల వారీగా సర్వీసులు.. హైదరాబాద్ నుంచి ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి సర్వీసులు కేటాయింపు చేశారు. అద్దంకి డిపో నుంచి 12 ఎక్స్‌ప్రెస్‌లు, చీరాల నుంచి 19 అల్ట్రా డీలక్స్‌లు, 2 ఎక్స్‌ప్రెస్‌లు, గిద్దలూరు డిపో నుంచి 6 సూపర్‌లగ్జరీ, ఒక అల్ట్రా డీలక్స్, 7 ఎక్స్‌ప్రెస్‌లు, కందుకూరు డిపోనుంచి 15 సూపర్‌లగ్జరీ, 17 అల్ట్రా డీలక్స్‌లు, 5 ఎక్స్‌ప్రెస్, కనిగిరి డిపో నుంచి 20 అల్ట్రాడీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, మార్కాపురం డిపో నుంచి 9 సూపర్ లగ్జరీ, 6 అల్ట్రా డీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, ఒంగోలు డిపో నుంచి 6 సూపర్ లగ్జరీ, 20 అల్ట్రా డీలక్స్, 4 ఎక్స్‌ప్రెస్, పొదిలి డిపోనుంచి 6 సూపర్‌లగ్జరీ, 4 అల్ట్రాడీలక్స్, 4 ఎక్స్‌ప్రెస్ వెరసి మొత్తంగా 42 సూపర్‌లగ్జరీ, 87 అల్ట్రాడీలక్స్, 54 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రయాణికులను జిల్లాకు తీసుకువచ్చేందుకు నడపాలని నిర్ణయించారు. అన్ని డిపోల నుంచి 27వ తేదీన 27, 28వ తేదీ 43, 29వ తేదీ 50 సర్వీసులు నడపాలని నిర్ణయించారు. ఇక తిరుగు ప్రయాణానికి మాత్రం రద్దీని బట్టి అంటే అక్టోబరు 1, 2 తేదీల్లో అత్యధికంగా బస్సులు నడపాలని ప్లాన్ చేస్తున్నారు. దోపిడీ ఇలా... ప్రస్తుత టిక్కెట్ ధరలను పరిశీలిస్తే ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ ఛార్జీ రూ.281, సూపర్ లగ్జరీకి రూ.374, ఇంద్రా ఏపీకి రూ.471, గరుడ ఏసీ రూ.551, అమరావతి ఏసీ ధర రూ.641 గా ఉంది. మధ్య తరగతి ఎక్కువుగా ప్రయాణించే బస్సులు ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలు. వీటిలో ప్రస్తుతం సాధారణ షెడ్యూలు బస్సుల్లో డీలక్స్, అల్ట్రా డీలక్స్‌లు లేనేలేవు. ఇక మిగిలిన ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీలను పరిశీలిస్తే వాటి ధరలు 50శాతం పెంచేసి ప్రత్యేక సర్వీసులుగా ప్రకటించేశారు. అంటే ప్రత్యేక బస్సులకు ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర రూ.440కు, అల్ట్రా డీలక్స్ రూ.532కు, సూపర్ లగ్జరీ రూ.561కు పెంచారు. ఏసీ సర్వీసులకు మాత్రం 10 నుంచి 20 శాతం చార్జిలను పెంచారు. ఇంద్ర, గరుడ సర్వీసులకు 20 శాతం పెంచగా అమరావతి సర్వీసుకు మాత్రం 10 శాతం చార్జి మాత్రమే పెంచారు. తద్వారా ఏసీ సర్వీసులలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవాలనే ఉద్దేశం కనబరుస్తున్నారు. ఇంద్ర, గరుడ, అమరావతి రోజువారీ నడిచే బస్సులే తప్ప ప్రత్యేకంగా ఎటువంటి బస్సులు వేయనప్పటికీ ఫ్లెక్సీ ఫేర్ పేరుతో ధర పెంచేశారు. ప్రయాణికుల రద్దీ రోజులంటూ కొద్దికాలంగా ఆర్టీసీ ధరలు అమాంతం పెంచేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఈ పెంచిన ధరలను అమలు చేస్తున్నారు. అమరావతి సర్వీసు «టికెట్ రూ.706, గరుడ సర్వీసు టిక్కెట్ ధర రూ.662, ఇంద్ర సర్వీసు రూ.566గా నిర్ణయించారు. పట్టపగ్గాలు లేని ప్రైవేటు దోపిడీ... ప్రైవేటు బస్సుల దోపిడీకి పట్టపగ్గాల్లేకుండా పోతున్నాయి. తిరుగు ప్రయాణంపైనే ఎక్కువుగా ప్రైవేటు రవాణా సంస్థలు దృష్టి సారించాయి. నాన్ ఏసీ హైటెక్ టిక్కెట్ ధర రూ.549 మొదలు రూ.860 వరకు వసూలు చేస్తున్నారు. ఏసీ టిక్కెట్లను రూ.1,134 నుంచి రూ2,754 వరకు ఆన్లైన్లో విక్రయిస్తుండడం దసరా దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
చేప ప్రసాదానికి స్పెషల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: చేపప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, నాంపల్లి,కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ,జూబ్లీ బస్స్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే వారు నేరుగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకొనేలా ఈ నెల 8,9 తేదీల్లో అదనపు బస్సులను నడపనున్నారు. 8వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 9వ తేదీ చేపప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు 100 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ప్రధాన బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయంతో పాటు, దిల్‌శుఖ్‌నగర్, వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ,మిధానీ ల్యాబ్ క్వార్టర్స్, ఉప్పల్, చార్మినార్,గోల్కొండ,రాంనగర్,రాజేంద్ర నగర్, రీసాలాబజార్,ఈసీఐఎల్,పటాన్చెరు,జీడిమెట్ల,కేపీహెచ్‌బీ,తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులకు ‘చేపప్రసాద్ స్పెషల్-నాంపల్లి-ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతారు. సహాయ కేంద్రాలు... కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్,జేబీఎస్‌ల వద్ద ప్రయాణికుల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలు అందజేస్తారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో ప్రయాణికులు ఫోన్ ద్వారా కూడా ఆర్టీసీ అధికారుల నుంచి స్పెషల్ బస్సుల సమాచారాన్ని పొందవచ్చు. -
ఐదు నిమిషాలకో బస్సు
-
పునరావాస కేంద్రాలకు ససేమిరా..!
నరసన్నపేట రూరల్( పోలాకి) : పోలాకి మండలంలోని పలు తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు అంగీకరించడం లేదు. మేం గ్రామాల్లోనే ఉంటామంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుట స్పష్టం చేసిన సంఘటన శనివారం సంభవించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో తీరగ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంతటి తుపాను వచ్చినా మేం గ్రామాలను కదలమని, ఇళ్లలోనే ఉంటామని మత్య్సకారులు అంటుండటంతో అధికారులకు ఏమీ పాలు పోవడం లేదు. మండలంలోని రేవు అంప్లాం,కొత్తరేవు, కోడూరుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోడూరు కేంద్రానికి రావాలని గుప్పడిపేట, గుల్లవానిపేట,రాజపురం గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గ్రామాలను వదిలిరామని చెప్పడంతో అధికారులు నిరాశతో వెనుదిరిగారు. గతంలో పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు పడ్డామని ఇళ్లలోనే బాగుంటుందని వాదిస్తున్నారు. తుపాను తీవ్ర అధికంగా ఉన్నందున అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. శనివారం ఆయన తీర గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. రాత్రి నుంచి తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని, చాలా ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరించారు. నరసన్నపేట సీఐ చంద్ర శేఖర్ తదితరులు కూడా ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తహశీల్దార్ రామారావు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో పాల ప్యాకెట్లు, కిరోసిన్, తాగు నీరు, బియ్యం, పప్పులు, గ్యాస్‌లతో పాటు అవసరమైన సరుకులు సిద్ధం చేశామన్నారు. పునరావాస కేంద్రాలకు రాని ప్రజలు పూండి: వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులు చేరుకోవడం లేదు. అధికారులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ శనివారం రాత్రి 7 గంటల వరకు ఇళ్లను వదిలి వచ్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు, పీఎంపురం, పాతటెక్కలి, గరుడభద్ర, గోవిందపురం పునరావాస కేంద్రాల్లో 500 బందికి వంటలు సిద్ధం చేశారు. రాత్రికి పరిస్థితి మారితే బలవంతంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తుపాను ప్రత్యేకాధికారులు డీఆర్డీఏ ఏపీడీ, పంచాయితీరాజ్ ఈఈ ఆర్. వరప్రసాద్ బాబు టి.సరోజ చెప్పారు. పునరావాస కేంద్రాల్లో 5 వేల లీలర్ల మంచి నీటి ట్యాంక్‌లు సిద్ధం చేశామని ఆర్‌డబ్ల్యూస్ డీఈఈ డి. సూర్యనారాయణ, ఏఈఈ టి.గౌతమి చెప్పారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కె.రవికిషోర్ పూడి లంక వాసులును పీఎంపురం పునరావాస కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. కేంద్రాలకు వచ్చేందుకు ససేమిరా..! ఎచ్చెర్ల: తుపాను పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు మండలంలోని పలు తీరప్రాంత గ్రామాల ప్రజలు ఇష్టపడడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంత నచ్చజెప్పినా ఇళ్లు విడిచి వచ్చేందుకు ముందుకు రావ డం లేదు. ప్రత్యేకాధికారి కె.మనో రమ, తహశీల్దార్ బందర వెంకటరావు, ఎస్ఐ ఉదయ్ కుమార్ శనివారం రాత్రి వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజ లను పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయినా వారు అంగీకరించక పోవడంతో వాహనాలను గ్రామాల్లో మొహ రించారు. అత్యవసర పరిస్థితి వస్తే అర్థరాత్రయినా తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బొంతల కోడూరు పంచాయతీ లావేటి పేట, రుప్ప పేట, పాత దిబ్బలపాలేం, డిమత్స్య లేశం, బడివానిపేట, బుడగుట్లపాలేం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో 1400 మంది ప్రజలకు సరిపడా భోజనాన్ని వండారు. ఎమ్మెల్యే కళావెంకటరావు బడివాని పేట సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. సగం మందే పునరావాస కేంద్రాలకు.. ఇచ్ఛాపురం: తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు శనివారం సాయంత్రం తరలించారు. అయితే మొత్తం 5 గ్రామాలకు సంబంధించి సుమారు 4,500 మందికి గాను 2 వేల మంది కూడా తరలి వెళ్లలేదు. చిన్నలక్ష్మీపురం,పెద్ద లక్ష్మీపురం, శివకృష్ణాపురం గ్రామాల నుంచి ప్రజలను ఈదుపురం పునరావాస కేంద్రాలకు తరలించారు. పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రానికి మరికొందరిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ముందు వచ్చేందుకు నిరాకరించిన తరువాత అధికారుల విజ్ఞప్తి మేరకు పునరావాస కేంద్రాలకు బయలుదేరారు. డొంకూరు గ్రామ ప్రజలు మాత్రం వచ్చేందుకు నిరాకరించారు. దాంతో అత్యవసరమైతే వారిని తరలించేందుకు బస్సులను అక్కడ సిద్ధంగా ఉంచారు. వాటితో పాటు సుమారు పది స్విమ్మింగ్ బోట్లు కూడా సిద్ధం చేశారు. -
సీఎం స్పెషల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సరుబుజ్జిలి: రణస్థలంలో గురువారం జరిగిన సీఎం చంద్ర బాబు సభకు స్వయం శక్తి సంఘాల మహిళలతో సరుబుజ్జిలి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. స్థానిక కర్ర చెరువు సమీపంలో బురదలోకి దిగబడి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో మహిళలు భ యాందోళనకు గురయ్యారు. కొందరు బస్సు నుంచి.. బయటకు గెంతేశారు. మరి కొద్దిగా బస్సు ఒరిగి ఉంటే..పెను ప్రమాదం సంభవించేదంటూ.. విలపించారు స్థానిక టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ను, ఎల్‌ఎన్‌పేట నుంచి పొక్లెయిన్‌ను తెచ్చి..బస్సును బయటకు తీసేసరికి 3 గం టలు కావడంతో..కొందరు మహిళలు వెనుదిరి గారు. మరి కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడి మేర కు ఆకలితో చంద్రబాబు సభకు హాజరయ్యారు. -
ఈ అధిక చార్జీల బాదుడేంటి?
సాక్షి, హైదరాబాద్: రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్న ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటైన ప్రభుత్వరంగ సంస్థ ఇలా వ్యాపారం చేస్తే ఎలా?’ అంటూ నిలదీసింది. ‘రైళ్లలో కూడా ప్రయాణికులు వెళుతున్నారు. రైల్వేశాఖ అధిక చార్జీలు వసూలు చేయడం లేదు కదా’ అని వ్యాఖ్యానించింది. ఎందుకు అధిక చార్జీలను వసూలు చేయాల్సి వస్తుందో తెలుపుతూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానుల ధర్మాసనం ఆదేశించింది. పండుగలు, ఇతర పర్వదినాలు, వేసవి సెలవుల్లో ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికుల నుంచి దాదాపు 150 శాతం అధికంగా చార్జీలను ఆర్టీసీ వసూలు చేస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామరాజు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దానిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజల నుంచి అధిక మొత్తాలను వసూలు చేసుకునేందుకు ప్రభుత్వమే ఆర్టీసీకి అనుమతినిచ్చిందని, ఆ మేర 2003లోనే జీవో జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆర్టీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రభుత్వం అనుమతించినందునే అధిక చార్జీలు వసూలు చేస్తున్నామన్నారు. రోజూ వారి బస్సులకు తాము అధిక చార్జీలను వసూలు చేయడం లేదని, పండుగ లు, సెలవు దినాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పా టు చేసే ప్రత్యేక బస్సుల్లోనే అధిక చార్జీలను వసూలు చేస్తున్నామని వివరించారు. దానిపై సంతృప్తి చెందని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్టీసీని, ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది.