సాక్షి, అమరావతి: ఉత్తరప్రదేశ్లోని ‘మహా కుంభమేళా’కు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రెండు రూట్లలో భక్తుల సౌకర్యార్థం సర్వీసులు నడుపుతోంది. దీన్లోభాగంగా 11వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతి నుంచి, 12వ తేదీ నెల్లూరు నుంచి సర్వీసులను ఏర్పాటు చేశారు.
అయితే యాత్రల దర్శనం, టిఫిన్, భోజన ఖర్చులను ప్రయాణికులే భరించాలని ఏపీటీడీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ కోసం www.aptdc.in, tourism.ap.gov.in వెబ్‌సైట్లను, ఏపీటీడీసీ సీఆర్‌వో కార్యాలయం, అధీకృత ఏజెంట్లను సంప్రదించాలని సూచించింది.
రూట్–1: తిరుపతి, ఒంటిమిట్ట, కడప బైపాస్, ఓర్వకల్లు, కర్నూలు బైపాస్, హైదరాబాద్, జబల్‌పూర్, చిత్రకూట్, ప్రయాగ్‌రాజ్, కాశీ, నాగపూర్, ధర్మపురి మీదుగా ఉంటుంది.
రూట్–2: నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, అన్నవరం, విశాఖపట్నం, పూరి, కోణార్క్, భువనేశ్వర్, కటక్, చంఢీపూర్, గయా, బుద్ధగయా, కాశీ, ప్రయాగ్‌రాజ్ వెళ్లి తిరుగు ప్రయాణంలో శ్రీకూర్మం, అరసవెల్లి, విజయవాడ మీదుగా నెల్లూరు.
Comments
Please login to add a commentAdd a comment