
సీఎం స్పెషల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సరుబుజ్జిలి: రణస్థలంలో గురువారం జరిగిన సీఎం చంద్ర బాబు సభకు స్వయం శక్తి సంఘాల మహిళలతో సరుబుజ్జిలి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. స్థానిక కర్ర చెరువు సమీపంలో బురదలోకి దిగబడి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో మహిళలు భ యాందోళనకు గురయ్యారు. కొందరు బస్సు నుంచి.. బయటకు గెంతేశారు. మరి కొద్దిగా బస్సు ఒరిగి ఉంటే..పెను ప్రమాదం సంభవించేదంటూ.. విలపించారు స్థానిక టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ను, ఎల్‌ఎన్‌పేట నుంచి పొక్లెయిన్‌ను తెచ్చి..బస్సును బయటకు తీసేసరికి 3 గం టలు కావడంతో..కొందరు మహిళలు వెనుదిరి గారు. మరి కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడి మేర కు ఆకలితో చంద్రబాబు సభకు హాజరయ్యారు.