Sarubujjili
-
భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటం
సరుబుజ్జిలి : మరో మహిళతో తన భర్త కాపురం చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా భర్త ఇంటి ఎదుటే మౌన పోరాటానికి దిగింది. దీనికి రొట్టవలస గ్రామం వేదికైంది. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వీరఘట్టం గ్రామానికి చెందిన శీరాపు నాగభూషణరావు, శ్రీదేవిల ఏకైక కుమార్తె మాధురిని రొట్టవలస గ్రామానికి చెందిన కొన్న రామ్మూర్తి, మీనాక్షి దంపతుల రెండో కుమారుడు వసంతకుమార్‌కు ఇచ్చి 2014 ఆగస్టు 14వ తేదీన వివాహం జరిపించారు. వసంతకుమార్ గ్రామంలో ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో పదకొండున్నర లక్షల రూపాయలను వసంతకుమార్‌కు ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పెళ్లయిన రెండు నెలల తరువాత మాధురి, వసంతకుమార్ దంపతులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ నుంచి మాధురి కన్నవారికి ఎటువంటి ఫోన్‌గాని, ఇతర సమాచారం రాలేదు. అదే ఏడాది డిసెంబర్ రెండో తేదీన తమ కుమార్తె మాధురితో ఫోన్ చేయించి అంతా బాగానే ఉన్నామని చెప్పమన్నాడని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమంలో కోటబొమ్మాళి మండలం సాలిపేట గ్రామానికి చెందిన ఓ వివాహితను కూడా తమ అల్లుడు వసంతకుమార్ హైదరాబాద్ రప్పించుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడని, అప్పటి నుంచి తమ కుమార్తెను పట్టించుకోవడం మానేశాడని మాధురి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై ఎన్నిసార్లు తమ అల్లుడిని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా పట్టించుకోకపోవడంతో మాధురి కొద్ది నెలలుగా కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కోరుతూ మాధురి, ఆమె తల్లిదండ్రులు వసంతకుమార్ ఇంటి ఎదుట మౌన దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని మాధురి భర్త వసంతకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తన భార్య సక్రమంగా తనపట్ల ఉండక పోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. వేరొక అమ్మాయితో అకారణంగా కొంతమంది తనను ఇరికించినట్టు చెప్పారు. -
సీఎం స్పెషల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సరుబుజ్జిలి: రణస్థలంలో గురువారం జరిగిన సీఎం చంద్ర బాబు సభకు స్వయం శక్తి సంఘాల మహిళలతో సరుబుజ్జిలి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. స్థానిక కర్ర చెరువు సమీపంలో బురదలోకి దిగబడి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో మహిళలు భ యాందోళనకు గురయ్యారు. కొందరు బస్సు నుంచి.. బయటకు గెంతేశారు. మరి కొద్దిగా బస్సు ఒరిగి ఉంటే..పెను ప్రమాదం సంభవించేదంటూ.. విలపించారు స్థానిక టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ను, ఎల్‌ఎన్‌పేట నుంచి పొక్లెయిన్‌ను తెచ్చి..బస్సును బయటకు తీసేసరికి 3 గం టలు కావడంతో..కొందరు మహిళలు వెనుదిరి గారు. మరి కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడి మేర కు ఆకలితో చంద్రబాబు సభకు హాజరయ్యారు. -
రైలు బెర్తులు కాదు...
సరుబుజ్జిలి, న్యూస్‌లైన్ :ఇదేమిటి ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నారు. ఇదేమైనా రైలు బెర్తులపై కూర్చుని ప్రయాణిస్తున్నారు అని మనం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఆశ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వసతి ఇరుకుగా ఉండడంతో తప్పని సరిస్థితుల్లో ఆస్పత్రి బెడ్లపై ఇలా ఎదురెదురుగా కూర్చున్నారు. వసతి సమస్య కారణంగా పీహెచ్సీలో ఏ సమావేశం నిర్వహించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది -
రైతుల జీవితాల్లో ఇసుక తుపాను
సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, వరదలు విలువైన పంట లనే కాకుండా.. భూముల సారాన్ని కబళించాయి. నదీతీరాల్లో ఉన్న వందలాది ఎకరాల పంట పొలాల్లో వరదలకు కొట్టుకొచ్చిన ఇసుక మేటలు వేసింది. సారవంతమైన భూములను నిర్జీవం చేసింది. వేసిన పంటలు ఎలాగూ పో యాయి. అప్పోసప్పో చేసి మళ్లీ పంట వేద్దామ న్నా ఇసుక మేటలు అడ్డువస్తున్నాయి. ఇసుకను తొలగించి.. భూములను తిరిగి సాగుయోగ్యం గా మలచడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైగా దీనికే వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా వంశధారకు వరద పోటెత్తడంతో తీరంలో ఉన్న పంట పొలాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు నీరు తొలగి.. జరిగిన నష్టం కళ్లకు కడుతోంది. పొలా ల నిండా ఇసుకే కనిపిస్తోంది. కాపుకొచ్చిన వరి, ఇతర వాణిజ్య పంటలు ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలోని బెంజరుపేట పొలాల దుస్థితే దీనికి నిదర్శనం. గ్రామానికి చెందిన సుమారు వందమంది రైతులు 600 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. వంశధార తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ భూములు వరదలు సంభవించినప్పుడల్లా ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామంతోపాటు అగ్రహారం నుంచి అలమాజీపేట వరకు సుమారు 1345 ఎకరాల్లో తీర భూములు విస్తరించి ఉన్నాయి. ఇటీవలి వరదల్లో ఈ భూముల్లోని పంటలన్నీ దెబ్బతిన్నాయి. కాగా వరద నీరు జిరాయితీ భూముల మీదుగా ప్రవహించడంతో సుమారు 300 ఎకరాల్లో వరి, మరో 50 ఎకరాల్లో మొక్కజొన్న, బెండ, దొండ తదితర వాణిజ్య పంటలు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయాయి. మిగిలిన పొలాల్లోనూ ఎక్కడిక్కడే ఇసుక మేటలు వేయడం వల్ల వరిచేను పనికి రాకుండా పోయింది. పొలాలు నిస్సారమయ్యాయి. మదుపుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి.. ఇసుక తొల గించి తిరిగి పంటలు వేసేం దుకు ఆయ్యే ఖర్చు కు ఎక్కడ తల తాకట్టు పెట్టాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది తిండి గింజలు కూడా కరువేనని సాధారణ రైతులే విలపిస్తుం డగా.. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రభుత్వం నుంచి రుణాలు పుట్టే అవకాశం కూడా లేదని వారు వాపోతున్నారు. బెంజరుపేట గ్రామం నదీ గర్భంలో ఉండడం వల్ల ఏటా రైతులు నష్టాలు చవి చూస్తున్నారు. పంటలే కాదు లక్షలాది రూపాయల విలువైన జిరాయితీ భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. తెలికిపెంట, పాతపాడు, పెదవెంకటాపురం తదితర గ్రామాలు సైతం ప్రతి ఏటా నష్టపోతున్నాయి.