
తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. వకీల్‌సాబ్‌లోని రెండో పాట ‘సత్యమేవ జయతే’ను మార్చి 3 రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. వకీల్‌సాబ్‌లోని రెండో పాట ‘సత్యమేవ జయతే’ను మార్చి 3 రిలీజ్ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించారు.
#SatyamevaJayate Lyrical Video from Power Star @PawanKalyan's #VakeelSaab on March 3rd @ 5 PM#VakeelSaabMusicalFest#VakeelSaabOnApril9th pic.twitter.com/09jSjEzEui
— BARaju (@baraju_SuperHit) March 2, 2021
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మగువా మగువా పాటకు విశేష స్పందన లభించింది. పాట రిలీజ్ అయిన చాలా రోజుల వరకు అందరి నోట, ఫోన్లలో ఇదే పాట నానింది. అలాగే ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.. మరి సత్యమేవ జయతే సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కాగా బాలీవుడ్‌లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్' లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది.
చదవండి :