
దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ విడుదలై మూడేళ్లు అవుతుండటంతో వెండితెరపై ఆయనను చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చుస్తున్నారు. అయితే 2020లోనే వకీల్ సాబ్ మూవీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రీల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రాజకీయాలపై దృష్టి పెట్టిన ఆయన గ్లామర్‌కు కాస్తా దూరమయ్యాడు. గడ్డం పెంచి పెద్ద జట్టుతో ఉన్న పవన్ కాస్తా బరువు కూడా పెరిగాడు.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కాస్తా గ్లామర్‌పై దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలో పవన్ న్యూ లుక్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. క్లీన్ షేవ్‌తో స్లీమ్‌గా మునుపటి పవర్ స్టార్‌ల దర్శనమివ్వడంతో అభిమానులంతా సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈ ఫొటోలో పవన్ బ్లాక్ ట్రౌజర్-టీ షర్ట్‌తో నడుముపై చేతులు పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తు దర్శనం ఇచ్చాడు. ఇలా స్టైలిష్ లుక్ వపన్‌ను చూసి ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ‘పవర్ స్టార్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పవన్ క్రిష్ డైరెక్షన్‌లో, హరీష్‌శంకర్, సాగర్ చంద్ర డైరెక్షన్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
చదవండి:
శివరాత్రికి పవన్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్
పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు: అషూ రెడ్డి వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment