Vakeel Saab Official Trailer Release Date Fixed, Pawan Kalyan - Sakshi
Sakshi News home page

వకీల్‌ సాబ్‌ బిగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Mar 24 2021 5:19 PM | Updated on Mar 24 2021 7:40 PM

Pawan Kalyan Vakeel Saab Update: Official Trailer Release Date Locked - Sakshi

 ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ నటించిన పింక్ సినిమాకు రీమేక్‌ ఇది. హిందీలో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం.

అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల తేదిని ప్రకటించింది. మార్చి 29న వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

కాగా, వకీల్‌సాబ్‌ బిగ్‌ అడ్‌డేట్‌ రానుందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌  బుధవారం ఉదయం ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌ రాబోతుందని అంతా భావించారు. కానీ కేవలం ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని మాత్రమే ప్రకటించి అభిమానులను కాస్త నిరుత్సాహపరిచారు. మరోవైపు వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా ధరకు అమ్ముడుపోయాయి. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

.  

చదవండి:
షాకింగ్‌ వీడియో.. అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు!
అల్లు అర్జున్‌ కొత్త బిజినెస్‌: మహేష్‌కు పోటీగా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement