Pawan Kalyan Vakeel Saab Movie Theatrical Release Date Announced - Sakshi
Sakshi News home page

వకీల్‌ సాబ్‌ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్‌

Published Sat, Jan 30 2021 6:22 PM | Last Updated on Sun, Feb 28 2021 12:19 PM

Pawan Kalyan Vakeelsaab Release Date Confirmed - Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్’‌ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటుంది. కాగా గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఒకరికొకరు పోటీపడి మరి రిలీజ్‌ డేట్‌లు ఫిక్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పవన్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో వకీల్‌ సాబ్‌ యూనిట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్‌ డేజ్‌ ప్రకటించడంతో సినిమా కోసం ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్న పవర్‌ స్టార్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చదవండి: దూసుకొస్తున్న ఖిలాడి.. రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

కాగా సంక్రాంతి  సందర్భంగా ‘వకీల్‌ సాబ్‌’ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో పవర్‌ స్టార్‌ తొలిసారిగా వకీల్‌గా భిన్న పాత్ర పోషించారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. చదవండి: శర్వానంద్‌, సిద్ధార్ధ్‌ల‌ మహా సముద్రం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement