ఆ ఫోటోలు ఎందుకు షేర్‌ చేస్తానంటే: అనన్య నాగళ్ల | Actress Ananya Nagalla Comments On Her Instagram Photoshoot Images, Deets Inside - Sakshi
Sakshi News home page

Ananya Nagalla: ఆ ఫోటోలు ఎందుకు షేర్‌ చేస్తానంటే: అనన్య నాగళ్ల

Published Tue, Nov 7 2023 8:28 AM | Last Updated on Tue, Nov 7 2023 9:41 AM

Ananya Nagalla Comments On Her Instagram Posts - Sakshi

మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. అందం, అభినయంతో పాటు నటనలో మంచి టాలెంట్‌ ఉన్న బ్యూటీ అనన్య.. వకీల్ సాబ్ సినిమా అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ, అవకాశాలను మాత్రం అందివ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం తెలుగమ్మాయి అనే ప్రశ్నలు రావడం సహజం. తను హీరోయిన్‌ మెటిరీయల్‌ అయినప్పటికీ సహాయనటిగానూ ప్రేక్షకులను మెప్పించింది. ప్రధాన కథాననాయకగా ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్వేషి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్‌స్టా వేదికగా తరచూ గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి గల కారణాన్ని ఆమె తెలిపారు.

'వకీల్‌సాబ్‌’కు ముందు ఎక్కువగా ట్రెడిషనల్‌ ఫొటోలు షేర్‌ చేసేదాన్ని. శాకుంతలం చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక గ్లామర్ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దానికి చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఫొటోలు షేర్‌ చేయడానికి అప్పట్లో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ ఫొటోలకు భారీగా రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో పాటు సినిమా అనే రేస్‌లో నేను ఉండాలనుకుంటున్నా.. ఇక్కడ నువ్వు కొనసాగాలంటే అన్ని రకాలుగా కనిపించాలి.

ఈ కారణంతో మాత్రమే నేను గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తున్నాను.  అంతకుమించి ఎలాంటి కారణం లేదు. కమర్షియల్‌ సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి.. కానీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు.' అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇలా ఓపెన్‌గా ఉన్న విషయాన్ని చెప్పిన అనన్యపై నెటిజన్లు కూడా పాజిటివ్‌గానే రెస్పాన్స్‌ అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'అన్వేషి'  చిత్రాన్ని వి.జె.ఖన్నా డైరెక్ట్‌ చేశాడు. నవంబర్‌ 17న ఇది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement