వకీల్‌ సాబ్ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ కామెంట్‌ | Ram Charan Comments On Pawan Kalyan Vakeel Saab Trailer | Sakshi
Sakshi News home page

వకీల్‌ సాబ్ ట్రైలర్‌పై రామ్‌ చరణ్‌ కామెంట్

Mar 30 2021 12:32 PM | Updated on Mar 30 2021 2:42 PM

Ram Charan Comments On Pawan Kalyan Vakeel Saab Trailer - Sakshi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన 'వకీల్ సాబ్' చిత్రం నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 1.35కోట్ల పైగా వ్యూస్‌, 9లక్షలకు పైగా లైక్స్‌ అందుకోని రికార్డులు సృష్టిస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్‌ కల్యాణ్‌ 'వకీల్ సాబ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందుకే ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్‌పై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' ట్రైలర్ పై మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్ స్పందించాడు. ‘బాబాయ్... మైండ్ బ్లోయింగ్. ఎప్పట్లాగానే పవర్ ఫుల్ గా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు.దిల్ రాజు, బోని కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్‌‌ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘పింక్‌’కి రీమేక్‌ ఇది. అందులో అమితాబ్ చేసిన  లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.


చదవండి:

వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ లాంఛ్‌.. ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ 
హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్‌ ? ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement