
పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడులయ్యే అవకాశముంది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో వకీల్ సాబ్ షూటింగ్‌కి కాస్త విరామమిచ్చారు. అన్‌లాక్ ప్రక్రియ మొదలవడంతో ఇప్పుడిప్పుడే ఆగిపోయిన సినిమా షూటింగులు సెట్స్‌పైకి వెళ్తున్నాయి.
ఈక్రమంలో వకీల్ సాబ్ షూటింగ్ కూడా తిరిగి ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈమేరకు సినీ నిర్మాతలు పవన్‌ను సంప్రదించినట్టు సమాచారం. అయితే, పవన్ వారికో కండీషన్ పెటినట్టు తెలుస్తోంది. తాను చాతుర్మాస్య దీక్షలో ఉన్నందున సాయంత్రం 4 గంటల వరకే అందుబాటులో ఉంటానని చెప్పినట్టు తెలిసింది. దాంతో సాయంత్రం 6 తర్వాత తిరిగి యథావిధిగా పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చనేది ఆయన ఆలోచన. దీనికి నిర్మాతలు ఒప్పుకున్నారని, ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ చాతుర్మాస్య దీక్ష నవంబర్‌లో పూర్తి కానుంది.
(చదవండి: ఆలయంలో సతీసమేతంగా జక్కన్న పూజలు)
Comments
Please login to add a commentAdd a comment