పవర్‌ఫుల్‌ లాయర్‌ | Vakeel Saab motion poster released | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ లాయర్‌

Published Thu, Sep 3 2020 2:16 AM | Last Updated on Thu, Sep 3 2020 2:16 AM

Vakeel Saab motion poster released - Sakshi

‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన పవన్‌  కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌  కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ , కెమెరా: పి.ఎస్‌. వినోద్, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement