
హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు (07.05.) సందర్భంగా ఆయన తాజా చిత్రాల (మైఖేల్, ఊరు పేరు భైరవకోన) నుంచి లుక్స్ రిలీజయ్యాయి. పాన్ ఇండియా మైఖేల్ .. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివ చెర్రీ.
ఊరు పేరు భైరవకోన.. సందీప్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర.