
పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రం విడుదల గురించి పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. పండుగ నాడు వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేయనున్నారనే వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే వకీల్ సాబ్ యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. పండుగ నాడు టీజర్‌ని రిలీజ్ చేయాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 25న సాయంత్రం 5 గంటలకు వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందనే వార్త ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (చదవండి: కండీషన్లు పెట్టిన ‘వకీల్ సాబ్’..!)
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా వస్తుంది. ఈ మధ్యే వకీల్ సాబ్ షూటింగ్ మళ్లీ మొదలైంది. హిందీలో సూపర్ హిట్ అయిన్ పింక్‌కు రిమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్‌ని తెలుగులో దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిందని.. పవన్‌కు సంబంధిసంచి కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలిసింది. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. నిజానికి ఈ సినిమాను మేలోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యాయి. ఇక వకీల్ సాబ్ వచ్చే ఏడాది థియేటర్లలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment