ఎఫ్‌ 3లో పవన్‌ కల్యాణ్‌?, దిల్‌ రాజు క్లారిటీ | Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie | Sakshi
Sakshi News home page

F3 Movie-Dil Raju: ఎఫ్‌ 3లో పవన్‌ కల్యాణ్‌?, దిల్‌ రాజు క్లారిటీ

Published Thu, May 26 2022 8:57 PM | Last Updated on Thu, May 26 2022 9:24 PM

Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie - Sakshi

Dil Raju Clarifies On Pawan Kalyan In F3 Movie: విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎఫ్‌ 3. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ కథానాయికలుగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా రేపు(మే 27న) థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్‌ కార్యక్రమాలంతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎఫ్‌ 3కి సంబంధించిన ఓ ఆసక్తిర అప్‌డేట్‌పై ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌ కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: సింగర్‌ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు..

అయితే తాజాగా దీనిపై చిత్ర నిర్మాత దిల్‌ రాజ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్‌ 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించనున్నాడని తెలిపాడు. సినీ అభిమానులకు ఇదొక బిగ్ సర్‌ప్రైజ్‌ అని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌తో పాటు టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ కూడా స్క్రీన్‌పై కనిపిస్తారంటూ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. అనంతరం ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే స్క్రీన్‌పై పవన్ కల్యాణ్ ఏ విధంగా కనిపించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దీంతో దీనిపై సస్పెన్స్ నెలకొంది.

చదవండి: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ విన్నర్‌ బిందు మాధవికి బంపర్‌ ఆఫర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement